Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

205


స్వతంత్ర వివేచన నుపయోగించి యుండవలెననిగాని స్వతంత్ర వివేచననుపయోగించియుండకూడదనిగాని స్వబుద్ధి సుపయోగించి యుండవలెననిగాని ఉపయోగించియుండరాదని గాని అతనినిర్ణయముయొక్క క్రమానుగుణ్యత విమర్శింపబడరాదు. అతనినిర్ణయము రాజ్యాంగచట్టనిబంధన ప్రకారముగాలేదనికూడతర్కింప బడరాదు. అతని ప్రత్యేకబాధ్యతలకు సంబంధించిన విషయములందెల్ల గవర్నరుజనరలు ఇండియారాజ్యాంగ కార్యదర్శి యొక్క సామాన్య పెత్తనముక్రింద నుండవలెను. ఈ ప్రత్యేక బాధ్యతలనునవి పలువిధములైనవై యున్నందునను, వాని అన్వయావకాశము రబ్బరువలె ఎంత సాగదీసిన అంతదీర్ఘముగ విస్తరింపగలట్టివియునై యున్నందునను శాసనసభల అభిప్రాయముతో నిమిత్తములేకుండా వాని నొక్కొక్క దానినిగాని అన్నింటినిగాని పురస్కరించుకొని గవర్నరుజనరలు ఏకార్యమునకైనను గడంగవచ్చును. గవర్నరు జనరలునందు నెలకొల్పబడిన అనియంత్రణములగు సర్వాధికారములు ప్రాగ్దేశముల నిరంకుశదేశాధీశులను సైతము మరపింపగలంత పరిపూర్ణములును తీవ్రములు నై యున్నవి.

ఈ ప్రత్యేకబాధ్యతలయొక్క అంతరార్థమును మనము మఱువకూడదు. దేశముయొక్క శాంతిభద్రతలను కాపాడు బాధ్యత అనునది దేశస్వాతంత్ర్యముకొరకు లేవదీయబడు ఏ ఉద్యమము నైనను అణచుట కుపయోగింపబడితీరును.

శాసనధర్మము క్రమపరిపాలనము (Law and order)