పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

భారతదేశమున

3. మైనారిటీల (అల్పసంఖ్యాకజన సంఘముల) యొక్క న్యాయమైన హక్కులను కాపాడుట.

4. సర్కారు ఉద్యోగుల కీ రాజ్యాంగ చట్టమువలన నివ్వబడిన హక్కులను ఇంకను న్యాయమైన హక్కులను కాపాడుట.

5. భారతదేశములోనికి దిగుమతియగు బ్రిటీషుదీవుల సరకుల విషయమై ఎట్టి విచక్షణనుచూపి కష్టనష్టములు కలిగింపకుండ కాపాడుట.

6. బ్రిటీషు వర్తకులపట్ల పారిశ్రామికులపట్ల విచక్షణ చూపి కష్టనష్టములు కలిగింపకుండ కాపాడుట. (చట్టము యొక్క 5 వ భాగములోని 3 వ ప్రకరణమున చెప్పబడిన విషయములు.)

7. ఏ స్వదేశ సంస్థానముయొక్క హక్కులకుగాని ఏ సంస్థానాధీశునియొక్క గౌరవమునకును హక్కులగును గాని భంగము కలుగకుండ కాపాడుట.

8. గవర్నరు జనరలు అధికారము క్రిందనే యుండు పరిపాలన శాఖల కార్యములెల్ల అమలు జరుగునట్లు చూచుట.

గవర్నరు జనరలుయొక్క ప్రత్యేక బాధ్యతలకు సంబంధించినంతవరకు ఆ యధికారములను చలాయించి చర్య తీసికొనులలో అతడు తన స్వబుద్దినే ఉపయోగింపవలెను. అట్టి ప్రతివిషయమందును అతని నిర్ణయమునకు తిరుగులేదు. అతని నిర్ణయము లాప్రకారము చెల్లదనిగాని ఆతడు తన