Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

భారతదేశమున


దైన ప్రయత్నముచేసినచో గవర్నరు జనర లీయధికారమును బట్టి విఫలము చేయగలడు.

2. కొన్ని రకముల చిత్తుచట్టములను శాసససభలందు ప్రవేశపెట్టుటకు అనుజ్ఞనిచ్చుట, ఇవ్వక పోవుట.

3. ఒక చిత్తుచట్టమును ఆంగ్లరాజుయొక్క అనుమతికొరకు నిలుపుదలజేయుట.

4. శాసనసభలు ద్రవ్యవ్యవహారముల విషయమై చేసిన తీర్మానములను త్రోసిరాజనుట.

5. ఆర్డినెన్సులను జారీచేయుట.

(రాజకీయ విషయములందు ఇదివరకే ఆర్డినెన్సు శాసనాధికారమును గవర్నరు జనర లెన్నెన్ని విధములుగా నుపయోగించెనో అందరికిని తెలియును. అయితే ఆర్ధికముగా నిదియెట్లు ప్రయోగింపబడినదో చాలమంది గమనింపలేదు. 1927 వ సంవత్సరపు కరెన్సీచట్టమును గవర్నరు జనరలు 1931 వ సెప్టెంబరునెలలో నిరంకుశముగా సవరణచేయుచు నొక ఆర్డినెన్సును జారీచేసినాడు. ఈ ఆర్డినెన్సే మన దేశము నుండి 300 కోట్ల రూపాయల బంగారము ఇంగ్లాండుకు తరలిపోవుటకు గారణమైనదని అర్థశాస్త్రజ్ఞులు నిర్ణయించినారు. మన రూపాయ ఇంగ్లాండు నవరసుకు ముడిపెట్టబడి నవరసుయొక్క విలువ పడిపోయిన సందర్భములో ఆ తేడా విలువ వరకు బ్రిటీషు వర్తకునికి లాభము చేకూర్చినది. రాబోవు పరిపాలనలో నిట్టి వెన్ని జరుగనున్నవో!)