పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

201


ఇండియాలో చేరి లాభములార్జించు ఇతరవర్గములవారు - వీరికిగల స్వజాత్యభిమానము కన్నను వీరాశించు ఆర్థిక సర్వాధిపత్యముకన్నను ఇంగ్లీషువారి సామ్రాజ్యతత్వముగాని, ముసల్మానులకులతత్వముగాని మనకెక్కుడు భయంకరములుగావు. నూతన ఇండియారాజ్యాంగచట్ట మీఆర్థిక సర్వాధిపత్యమును బలవత్తరముగ చేయుచున్నది. భారతీయులు తమ రాజకీయాధికారములను బ్రిటీషు వారి యార్థిక లాభములకు హానికరముగా నుపయోగింతురనియే ఇంగ్లీషువారిభయము. అందువలననే, ఈక్రొత్తచట్టము 1919 సంవత్సరపు ప్రాతచట్టముకన్నను తీసికట్టుగ నున్నది.

V

గవర్నరు జనరలు అధికారములు

ఇట్లు ఫెడరలు శాసననిర్మాణసంస్థ అధికారవిహీనమగు పనికిమాలినసంస్థగా చేయబడియుండగా అన్ని అధికారములు గవర్నరు జనరలు చేతులలో కేంద్రీకరింపబడినవి. పైన చెప్పబడిన రీతిగా దేశరక్షణశాఖను విదేశ వ్యవహారములను క్రైస్తవమత వ్యవహారములను గవర్నరు జనరలు స్వయముగానే పరిపాలించును. వీని విషయములో అతడు ఇండియా రాజ్యాంగ కార్యదర్శికి బాధ్యత వహించును. దీనికితోడు గవర్నరు జనరలు కీక్రింది యధికారములు కలవు:

1. శాసన సభలు తీర్మానించిన ఏచిత్తుచట్టమునకైనను అనుమతి నివ్వక నిరాకరించి అది శాసనము కాకుండచేయుట. ప్రజలయొక్క ఆర్థికస్థితిని చక్కబరచుటకు శాసనసభవా రే