200
భారతదేశమున
హించుటలో గవర్నరు జనరలు తనస్వతంత్రవివేచననే ఉపయోగించును. అందువలన దిగుమతి సుంకముల ‘నిరకునామా' (టారిఫ్) విషయములో ప్రత్యక్షముగాగాని ప్రచ్ఛన్నముగాగాని ఎట్టివిచక్షణ చూపబడకుండులాగున అతడుకనిపెట్టి చర్యగైకొనును. స్వదేశపరిశ్రమలను బ్రిటీషు పోటీనుండి సంరక్షించుకొరకు శాసనసభ లేమైన చట్టములు చేయదలచినచో గవర్నరుజనరలు పై యధికారమును పురస్కరించుకొని దానిని నిషేధించి తీరును.
హిందూ దేశములో బ్రిటిషుపరిపాలనమును దృఢపరచి దానిని చిరస్థాయిగాచేయుట కేర్పడిన విశ్వప్రయత్న ఫలితమే ఈచట్టము. దీనికి రాజకీయ ఆర్థికస్వరూపము లనురెండుముఖములుగలవు. దీని రాజకీయ స్వరూపముకన్న ఆర్థిక స్వరూపమే అధికతరప్రాముఖ్యము గలయట్టిది. మహమ్మదీయుల కులతత్వమును గూర్చియు, ఇంగ్లీషువారి సామ్రాజ్యతత్వమును గూర్చియు పత్రికలందు మనము చదువుచునే యున్నాము. ఈ రెండు తత్వములు తలలెత్తుటకుగల మూలకారణము మన తెలివితక్కువయే యనుటకు సందియములేదు. రాజకీయాధికారము ఆర్థికవిషయములం దుపయోగించుపట్ల తప్ప నిజముగా రాజకీయములకు ప్రాముఖ్యత యుండవలసిన అగత్యము లేదు.
అందువలన నీరాజ్యాంగమువలన ఆర్థికక్షేమలాభముల కెట్టిఫలితములు కలుగునో తెలిసికొనవలెను. ఇంగ్లీషువర్తకులు పెట్టుబడిదారులు, పారిశ్రామికులు, వస్తునిర్మాతలు, ఇంకను