పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

భారతదేశమున


ఆ యధికారములను చలాయించవలెననియు స్పష్టీకరింపబడియే యున్నది. ఇక సంస్థానముల ఆంతరంగిక ప్రభుత్వాధికారములందు ఏవైన మార్పులుండునా? ఒక సంస్థానాధీశుడు ఫెడరేషనులో చేరునప్పుడు వ్రాయు ఒడంబడికపత్రములో ఫెడరలు ప్రభుత్వము, తనసంస్థానమునకు వర్తించు శాసనములు చేయుటకు తానంగీకరించు విషయములనెల్ల స్పష్టముగా వివరించును. అట్లు అంగీకరింపని విషయములందు ఫెడరలు ప్రభుత్వము చేసిన శాసనములకు ఆ సంస్థానము లోబడదు. మఱియు ఫెడరలు శాసనములను ఆ సంస్థానములో అమలుచేయునది ఫెడరలుప్రభుత్వోద్యోగులుగాక సంస్థానోద్యోగులే. ఇందు విపరీతమేమనగా అసెంబ్లీశాసనసభలో నూటికి 33 మంది, కవున్సిలు సభలో నూటికి 40 మంది, ప్రతినిధులు గలిగిన సంస్థానములు బ్రిటీషుపరగణాలకుచేయబడు శాసన నిర్మాణమున పాల్గొనవచ్చును గాని ఆశాసనసభలే యీసంస్థానములకు అవి అంగీకరించిన విషయములందుతప్ప తక్కిన విషయములందు శాసనములు చేయరాదు!

అనగా ఈసంస్థానాధీశులు బ్రిటిషు పరగణాలలో చేయబడు ప్రజాప్రభుత్వశాసనముల నోడించుట కధికారము కలిగియుందురు; మరియు, తమసంస్థానములలో నిరంకుశాధికారములును కలిగియుందురు. సంస్థానములందలి ప్రజలమాట రాజ్యాంగము తలపెట్టనే లేదు! ఇంకొకవిశేషమేమనగా ఫెడరేషను ప్రారంభములో సంస్థానములు చేరకపోయినచో శాసనసభలందుండవలసిన నిర్ణీతసంఖ్యను అప్పటికి చేరినసంస్థానములే