Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

191


బదిమంది చొ॥ సంస్థానముల ప్రతినిధులుగానున్నారు. ఈ రెండు శాసనసభలు కలిసిన సంయుక్త సమావేశములో మొత్తము సంఖ్యలో 406 మంది బ్రిటీషు పరగణాల ప్రతినిధులుగను 229 మంది సంస్థాన ప్రతినిధులుగ నున్నారు. అందువలన నీ కేంద్ర ఫెడరలు శాసనసంస్థ దేశప్రజల అభిప్రాయమును ప్రతిబింబించగలదనుమాట కల్ల. ఈ సంస్థలో సంస్థానాధీశులు, జమీందారి భూస్వాములు, కులతత్వాభిమానులు, ప్రాబల్యము వహించి ఒక సామ్రాజ్యాభిమానుల “బ్లాకు'ముఠాగా, ఏకమై గవర్నరు జనరలు యొక్క అపరిమితములైన సర్వాధికారములను ప్రజలకు వ్యతిరేకముగా చలాయించుటకు వీలుకల్గింతురు

సంస్థానాధీశులు:

భారతదేశ ప్రజలకు సామ్రాజ్య తత్వముపైన గల రోతకుప్రతిక్రియగా జాగీర్దారీ (ఫ్యూడలు) విధానముయొక్క అవశిష్టములనదగిన సంస్థానములతో సామ్రాజ్య తత్వము మచ్చిక చేసికొని దాని నుపయోగింపదలచినది.

ఈ సంస్థానములు ఫెడరేషనులో చేరుటవలన వానికిని బ్రిటీషు సామ్రాజ్య ప్రభుత్వమునకును జరిగిన ఒడంబడికల షరతులవలన ఏర్పడిన హక్కులకు భంగము కలుగదు. బ్రిటిషు సామ్రాజ్య ప్రభుత్వమునకు వారితో అట్టిసంధియొడం బడికలున్నందున సార్వభౌమత్వపు అధికారములును, హక్కులును ఫెడరలు ప్రభుత్వము చలాయింప వీలులేదనియు బ్రిటీషుచక్రవర్తియొక్క ప్రతినిధిహోదాలో వైస్రాయియే