190
భారతదేశమున
లోబడుదురు. ఇట్టి నియోజకవర్గమువలన కేంద్రఅసెంబ్లీకి హెచ్చుమంది కాంగ్రెసు సభ్యు లెన్నుకొనబడకపోవచ్చును. నిజముగా సామ్రాజ్యతత్వమునకు విరోధులెవ్వరు నీ కేంద్రశాసనసభలో ప్రవేశించుటకు వీలులేకుండా చాలా కట్టుదిట్టములుచేయబడినవి. దేశములో స్వార్థముకొరకు పాటుపడుతరగతులు స్టేటుకవున్సిలులో స్థిరముగా ప్రతిష్టింపబడుటయేగాక క్రింది సభతో పాటు ఈ స్టేటుకవున్సిలుకు ద్రవ్యవిషయములందు శాససనిర్మాణమునందు సమానములగు అధికారము లివ్వబడినందున ఫెడరలు శాసనసంస్థలో వీరు అభివృద్ధికి గొప్ప ఆటంకముగా నుందురు. ధనికులయొక్కయు భూస్వాములయొక్కయు ప్రతినిధియగు స్టేటుకవున్సిలువంటి సభకు జనసామాన్యముయొక్క ప్రతినిధుల సభయగు అసెంబ్లీసభతో సమానమైన అధికారము లివ్వబడుటగూడా రాజనీతిశాస్త్రముయొక్క ప్రాథమిక సూత్రమునకు విరుద్దమే. అయితే భారతదేశప్రజలను కొల్లగొను బ్రిటీషు సామ్రాజ్యతత్వము దేశీయ ప్రజా సమూహము లెల్ల తనకు వ్యతిరేకముగా నుండుటను గ్రహించి, తమ ప్రభుత్వముమీదనే ఆధారపడి తమ్మే ఆశ్రయించి తమతోపాటు ప్రజలను కొల్లగొను ధనికులను భూస్వాములను జేరదీసి వారికి తగు మద్దతు చేయదలచుచున్నారు. అందువలననే బ్రిటీషు పార్లమెంటువారు స్వదేశసంస్థానములకు ఫెడరేషనులో అత్యంత ప్రాముఖ్యత నిచ్చినారు. ఫెడరలు అసెంబ్లీలో మొత్తము స్థానములలో నూటికి 33 మందిచొప్పునను స్టేటుకవున్సిలులో నూటికి నలు