Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

189


ప్రాథమిక సూత్రము. అయితే బ్రిటీషుసామ్రాజ్య తత్వమునకు భారతదేశ ప్రజలన్న చాలాభయము. ప్రజాభిప్రాయముయొక్క ఒత్తిడివలన రాష్ట్రీయ అసెంబ్లీ సభలకు మాత్రము తిన్నని (డై రెక్టు) ఎన్నిక నొసగవలసి వచ్చినది. అయితే బ్రిటీషు సామ్రాజ్యతత్వము పోవలెనను వారి పలుకుబడి దేశములో నానాటికి హెచ్చుచున్నందున అందుకు ప్రతిక్రియగ కొంత జాగ్రత్త దీసికొన దలచిరి. ఇట్లు రాష్ట్రశాసనసభలకు ప్రత్యేక నియోజకవర్గములనుండి ఎన్నికలను నిర్ణయించి ఈ శాసనసభ్యులే కేంద్రఅసెంబ్లీకి ప్రతినిధుల నెన్నుకొను నియోజకులుగా నిర్ణయించుటలోని రహస్యము, ఫెడరలు అసెంబ్లీని జాతీయ కాంగ్రెసు వశపరచుకొనకుండ జేయవలెననియే! ఆసభకుకూడా ప్రజలే తిన్నగా ఎన్నుకొను నెడల ప్రజలు కాంగ్రెసువాదులనే ఎన్నుకొని తీరుదురు. ఇట్టి అప్రత్యక్షపుటెన్నిక కల్పింపబడినచో రాష్ట్రశాసనసభలయందు కాంగ్రెసు అధిక సంఖ్య సంపాదించిన రాష్ట్రములనుండి మాత్రమే కేంద్ర అసెంబ్లీసభకు కాంగ్రెను సభ్యులు ఎన్నుకొనబడగలుగుదురు. మఱియు ప్రజా సామాన్యముపైన కాంగ్రెసుకు హెచ్చు పలుకుబడి యున్నందున ఎన్నికలందు సులభముగా నెగ్గును. ప్రత్యేక నియోజక వర్గముల వలన శాసనసభల కెన్ను కొనబడిన శాసనసభ్యులలో వివిధరకములవా రుందురు. వివిధ జాతిమతములకు చెందినవారుందురు. వారిలో ఐకమత్యముండదు. కొంతమంది కేవలము ప్రభుత్వమునకు జోహుకుము లుందురు. కొందరు ప్రభుత్వాధికారమునకు పలుకుబడికి