బ్రిటీష్‌రాజ్యతంత్రము
187
నుండు సంస్థానప్రతినిధులు ఆ యా సంస్థానాధీశులవలననే నియమింపబడుదురు. 600 సంస్థానములకును వాని వాని ప్రాముఖ్యత గౌరవమునుబట్టి స్థానము లొసగబడినవి. ఇందు ముఖ్యముగా గమనింపవలసిన విషయమేమనగా: దేశములోని స్వాతంత్ర్యోద్యమమునకు విముఖులగువారే ఈ శాసన సభల యందు ప్రవేశించుటకును బలవంతులగుటకును ఎక్కుడు వీలుగా నుండునట్లు ఇవి నిర్మింపబడినవి. వివిధ జనసంఘముల ప్రత్యేక నియోజకవర్గములే ప్రతినిధుల నెన్ను కొనుపద్ధతియు రాష్ట్రీయ అసెంబ్లీ సభలనుండి ఫెడరలు అసెంబ్లీ శాసనసభకు అప్రత్యక్షము (ఇండై రెక్టు)గా ఎన్నుకొను పద్దతియు ఆస్తిగలవారు భాగ్యవంతులు స్టేటుకవున్సిలులో స్థిరముగా ప్రతిష్ఠింపబడుటయు ఉభయసభలందును సంస్థానములకు హెచ్చు స్థానము లొసగబడుటయు-ఇవియన్నియు దేశాభివృద్ధికాటంకము కలిగించువారును సామ్రాజ్యాభిమానులును శాసన నిర్మాణ సంస్థ యందు ప్రాబల్యము కలిగియుండులాగున చేసితీరును. కులముల వారీ వర్గములవారి ప్రత్యేక నియోజక వర్గములు అనునవి బ్రిటీషు పరిపాలనను చిరస్థాయిగా నొనరించుకొరకు ప్రథమమునుండియు అవలంబింపబడిన 'విడదీసి పాలించు' కుటిల రాజనీతిలో నొక భాగముగా నున్నవి. కులకక్షలకు మత భేదములకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వమువలన బుద్ధిపూర్వకముగా లేవనెత్తబడి వృద్ధిచేయబడినవి. వీలున్నప్పుడెల్ల వివిధ జాతులు, జనసంఘములు, ఒకదానిపై నొకటి ప్రయోగింపబడినవి. రాజ్యాంగములో నొక భాగముగా చేయబడిన