పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

భారతదేశమున


II

ఫెడరలు శాసన నిర్మాణసంస్థ

ఫెడరలు అసెంబ్లీలో బ్రిటీషు పరగణాలనుండి 250 మంది ప్రతినిధు లుందురు. స్వదేశసంస్థానములనుండి 125 మందికి మించని ప్రతినిధు లుందురు. స్టేటుకవున్సిలులో బ్రిటీషు పరగణాలనుండి 156 మంది ప్రతినిధులును సంస్థానములనుండి 104 మందికి మించని ప్రతినిధులు నుందురు. గొప్ప ఆస్తి హక్కులుగల ధనికులు జమీందారులు వర్తకపారిశ్రామిక శ్రేష్ఠులే స్టేటుకవున్సిలుకు ప్రతినిధుల నెన్నుకొందురు. ఫెడరలు అసెంబ్లీ రాష్ట్రశాసనసభల సభ్యులవలన ఎన్నకొనబడును.. రెండుసభలందును బ్రిటీషు పరగణాలనుండి ఎన్నుకొనబడు ప్రతినిధులు హిందు ముసల్మాను సిక్కు క్రైస్తవ ఆంగ్లోఇండియను మొదలగు జనసంఘముల ప్రత్యేకనియోజక వర్గములవలన ఎన్నుకొనబడినవారై యుందురు. కొన్ని స్థానములు మాత్రము వాణిజ్యసంస్థల, పరిశ్రమల, భూస్వాముల, కార్మికుల, స్త్రీల ప్రతినిధులకు ప్రత్యేకింపబడినవి.

ఫెడరలు అసెంబ్లీలోని కులములవా రీ స్థానములకన్నిటికి రాష్ట్రశాసనసభలలోని ఆ యా వర్గములకు చెందిన వారివలన వేరు వేరుగా ఎన్నుకొనబడుదురు. స్టేటుకవున్సిలులోని స్థానములు ఆయావర్గముల ప్రకారము దేశములో నలుప్రక్కల తయారు చేయబడిన ఎన్నిక పట్టికలో చేరిన ఆస్తిపరులగు వోటరులవలననే ఎన్నుకొనబడుదురు. ఉభయ సభలయందు.