బ్రిటీష్‌రాజ్యతంత్రము
185
యోగించవలెనని 10 వ సెక్షను విధించుచున్నందున అతడు తన ప్రాపకము నుపయోగించి దేశములోని, రాజకీయపక్షములం దొకరితో నింకొకరికి స్పర్దలను, వైరములను కలిగింపగలుగును. ఈమంత్రులసభ ఎట్టి అధికారములుగాని లేని పనికిమాలినసంస్థయై యుండును. మనదేశముయొక్క ఘోరదారిద్ర్యమును తొలగించుటకు దీని కావంతయైన శక్తి యుండదు. మన రాజ్యాంగనిర్మాణమున నీఘోరసామస్యా పరిష్కారమే ప్రాధాన్యత వహించియుండవలసినను నేడు మనకు దాపరించిన రాజ్యాంగమునుబట్టి అధికారములెల్ల భారతీయుల క్షేమమునకు విరుద్దముగా బ్రిటీషువర్తకునికి, ఉద్యోగికి లాభముకలిగించునట్లుగానే నిర్ణయింపబడినవి. గవర్నరుజనరలు తన స్వతంత్ర వివేచనను, స్వబుద్దిని వినియోగించునట్లు చట్టములో నిర్ణయింపబడిన సందర్భములందెల్ల ఆతడు ఇంగ్లాండులోని రాజ్యాంగ కార్యదర్శి పెత్తనముక్రింద వ్యవహరించుచు, ఆయనపంపు సూచనలకెల్ల బద్దుడై ప్రవర్తింపవలెనని 14 వ సెక్షను విధించుటనుబట్టియే ఈ యుద్దేశము స్పష్టమగుచున్నది. కరుణార్ద్రహృదయుడగు గవర్నరుజనర లెవ్వడైన మన కుపకారము చేయదలచిననుగూడ చేయజాలడు. ఇట్లు భారతదేశరాజ్యతంత్రమెల్ల ఇంగ్లాండునుండియే నడుపబడును. రాజ్యాంగ కార్యదర్శి పెత్తనము అనునది గవర్నరు జనరలుకు పంపబడు రాజనిర్దేశ పత్రమున స్పష్టీకరింప బడిన హద్దులుకలిగి యుండునని చెప్పబడినను ఆచరణలోగవర్నరు జనరలురాజ్యాంగకార్యదర్శి చెప్పుచేతలలోని తాబేదారుడు కాకతప్పదు.