Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

183


నను స్వబుద్దిని' ఉపయోగించి చలాయించవలెనట. చట్టమునం దతని కొసగబడిన అన్ని అధికారములను గూడ నతడట్లే చలాయించును. ఒక అధికారము తానట్లు చలాయించవలసినదగునా కాదా యని నిర్ణయించు నాతడుకూడ గవర్నరుజనరలే.

ఫెడరలువ్యవహారముల పరిపాలనలో గవర్నరు జనరలు ఈచట్టముక్రింద స్వతంత్రవివేచనను స్వబుద్దిని ఉపయోగించ వలసిన విషయములందు తప్ప తక్కినవానిలో అతనికి సలహాయిచ్చుటకు, సహాయము చేయుటకు, 9 వ సెక్సను ప్రకారము 10 మందికి మించని మంత్రులసభ యొకటి నెలకొల్పబడినది. ఈ మంత్రులసభ పరిపాలనముచేయు కార్యనిర్వాహక వర్గము (Executive body) కాదు. ఇది కేవలము కొన్ని విషయములందు గవర్నరుజనరలుకు సలహాసహాయము లొనరించుట కేర్చడినది.

11 వ సెక్షను ప్రకారము దేశరక్షణ, క్రైస్తవమతము, విదేశవ్యవహారములు, గవర్నరు జనరలు స్వతంత్ర వివేచనను స్వబుద్దిని ఉపయోగించు విషయములు - వీనినిగూర్చి అతడు మంత్రులతో ఆలోచింపడు. శాంతిభద్రతలు, ద్రవ్యపద్ధతియొక్క క్షేమము - అనగా అన్ని విధములయిన పన్నులనిధానము, ఫెడరలు ప్రభుత్వముయొక్క పరపతి - అనగా ఎక్కడనైనను ఎంత పడ్డీకైనను ఎప్పుడైనను ఋణము తెచ్చుట, అల్పసంఖ్యాకులయొక్క హక్కులనుకాపాడుట, ప్రభుత్వోద్యోగుల హక్కులు కాపాడుట, బ్రిటిషు