Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

భారతదేశమున


వలసిన పనియేలేదు. స్వబుద్దినుపయోగించి వ్యవహరించవలసిన విషయములందు వారు మంత్రులతో ఆలోచింతురు గాని మంత్రులసలహాప్రకారము పరిపాలింపవలెనను నియమములేదు. అందువలన నీమంత్రులు అధినివేశరాజ్యములందువలె ప్రభుత్వమువహించి కార్యనిర్వహణముచేయు పరిపాలక వర్గముగా నుండరు.

ప్రజాప్రభుత్వ పద్ధతులననుసరించి మంత్రుల కుండవలసిన పరిపాలనాధికారములు గవర్నరు జనరలు గవర్నరులకు నివ్వబడినట్లే శాసనసభల కుండవలసిన శాసననిరాణాధికారమునుగూడ గవర్నరు జనరలుకు గవర్నరులకు నివ్వబడినవి. రాజ్యాంగచట్టమునుబట్టి ఈశాసనసభలు కేంద్రమున గవర్నరు జనరలుయొక్కయు, రాష్ట్రములందు గవర్నరులయొక్కయు అనుజ్ఞను పొందనిది కొన్నివిషయములను గూర్చి శాసనములు చేయుటకు వీలులేదు. కొన్ని విషయములను గూర్చి శాసనములను చేయుటకసలే వీలులేదు. శాసనసభలు చేయగల చట్టములైనను గవర్నరు జనరలుయొక్క లేదా గవర్నరులయొక్క అంగీకారములేనిది అమలులోనికిరావు. గవర్నరు జనరలును గవర్నరులును తమకవసరమని తోచిన శాసనములను స్వయముగా చేయవచ్చును. వీరివిశేషాధికారములకు సంబంధించిన ఆదాయవ్యయములను గూర్చి కూడా శాసనసభలకు అధికారములేదు.

దేశముయొక్క శాంతిభద్రతలు, ఆర్థికక్షేమము, అల్పసంఖ్యాకజనసంఘముల హక్కులు, ప్రభుత్వోద్యోగుల