బ్రిటీష్‌రాజ్యతంత్రము
175
ఇదియే ప్రజాప్రభుత్వపద్ధతి; బాధ్యతాయుత స్వపరిపాలనముయొక్క రాజ్యాంగమర్యాద.
నూతనఇండియా రాజ్యాంగ చట్టము భారతదేశమునకు నిర్మించిన "ఫెడరల్" పరిపాలనా విధానమునందును రాష్ట్రములందు స్థాపించిన రాష్ట్రీయస్వపరిపాలనా విధానములందును కెనడా మొదలగు అధినివేశ రాజ్యాంగములందలి ప్రజాప్రభుత్వ పద్దతులుగాని, రాజ్యాంగమర్యాదలుగాని కానరావు సరికదా ఈ రాజ్యాంగచట్టములోని కొన్నిపద్ధతులును, నిబంధనలును ప్రజాప్రభుత్వపద్ధతులకు సిద్ధాంతములకును గూడ వ్యతిరేకములై గవర్నరుజనరలుయొక్కయు, గవర్నరులయొక్కయు, నిరంకుశ పరిపాలననే స్థాపింపజూచుచున్నవి. ఇచ్చటి గవర్నరు జనరలును, గవర్నరులును, ఆ రాజ్యములందువలె ప్రజాప్రతినిధుల యిష్టానుసారముగా అన్నివిషయములందును శాసనసభలకు బాధ్యులగు మంత్రుల సలహా సహాయములతో పరిపాలింపవలసిన పనిలేదు. దేశరక్షణ అనగా సైనికవ్యవహారములు, విదేశవ్యవహారములు, గవర్నరు జనరలు స్వయముగా పరిపాలించువిషయములు. మిగిలిన ప్రభుత్వ వ్యవహారములలో అనేకములు గవర్నరు జనరలును, గవర్నరులును తమ స్వతంత్ర వివేచనను, స్వబుద్దిని ఉపయోగించి స్వయముగా పరిపాలింపవలసినవిగా శాసింపబడి అందుకు కావలసిన విశేషాధికారములు వారికివ్వబడినవి. గవర్నరు జనరలును, గవర్నరులును తమ స్వతంతవివేచన నుపయోగింపవలసిన విషయములందు వారు మంత్రులతో ఆలోచింప