174
భారతదేశమున
రాజ్యాంగచట్టములను బట్టి ఆదేశములయొక్క ప్రభుత్వాధికారము ఇంగ్లాండుదేశరాజగు బ్రిటిషు చక్రవర్తియందే నెలకొల్పబడి, ఆయనప్రతినిధి యగుగవర్నరుజనరలు లేక గవర్నరువలన, ప్రజాప్రతినిధులగు మంత్రుల సలహాసహాయములతో చలాయింపబడునట్లు శాసింపబడినది. ఆగవర్నరుజనరలు లేక గవర్నరులు అన్ని ప్రభుత్వవ్యవహారములందును. మంత్రులయొక్క సలహాసహాయములతోనే పరిపాలన చేయుదురు. ఇంగ్లాండుదేశ ప్రజాప్రభుత్వపద్ధతులను బట్టి ఈ మంత్రిమండలివారు ప్రజలెన్నుకొనిన ప్రతినిధులుగల శాసనసభలోని అధికసంఖ్యాకుల పక్షమునకుజెంది, తమచర్యలకెల్ల ఆశాసనసభకే బాధ్యులైయుండి శాసనసభవారి విశ్యాసమునకు పాత్రులై యున్నంతకాలమే పరిపాలన చేయుదురు. దేశమునకు కావలసిన శాసనములన్నిటిని శాసనసభలే శాసించును. రాజ్యాంగధర్మమును బట్టి దేశపరిపాలనమంతయు చక్రవర్తిపేరునను అతని ప్రతినిధియగు గవర్నరు జనరలు లేక గవర్నరు పేరునను జరుగుచున్నను, సాక్షాత్తుగా ప్రభుత్వము వహించి కార్యనిర్వహణము చేయువారు శాసన సభలకు బాధ్యులగు మంత్రులే. ఇంగ్లాండులోని రాజువలెనే ఈగవర్నరుజనరలును, గవర్నరులును, ఈ మంత్రుల సలహాను ఎన్నడు త్రోసిపుచ్చరు. వీరికార్యనిర్వహణమునకు ఎన్నడును అడ్డుతగులరు. తా మేవ్యవహారమును స్వయముగాచేయరు. శాసనసభల యధికారమునకు ఆటంకము కలిగింపరు. పరిపాలనమెల్ల ప్రజాప్రతినిధుల యిష్టానుసారముగానే జరుగును.