పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

173


బాధ్యతాయుత పరిపాలనమునే ఒసగియుండినగాని లేదా అట్టిది ఒసగుటకు వీలులేదని స్పష్టముగా చెప్పివైచియుండిన గాని చాలబాగుండి యుండును. ప్రత్యేక బాధ్యతలు విశేషాధికారములు గవర్నరు స్వబుద్ది నుపయోగింపవలసిన రాజ్య వ్యవహారములుగల ఈ సంకరజాతి బాధ్యతాయుత ప్రజాపరిపాలనమును నెలకొల్పుటవలన భారతదేశమునందు కృతజ్ఞతగాని సహకారముగాని లేకపోవుటలో నాశ్చర్యములేదు.” అని సుప్రసిద్ధ రాజ్యనీతిశాస్త్రజ్ఞుడగు బెరీడేల్‌కిత్ పండితుడు తనఇండియా రాజ్యాంగచరిత్రలో వ్రాసియున్నారు.

III

బాధ్యతాయుత స్వపరిపాలనము

నూతన ఇండియా రాజ్యాంగచట్టము భారతదేశమునకు బాధ్యతాయుత స్వపరిపాలనము నొసగుచున్నదని కొంతమంది బ్రిటీషువారు వాదించుచుందురు. ఇదినిజమేనా! యనుసంగతి తెలిసికొనవలెనన్నచో బాధ్యతాయుత స్వపరిపాలన మనగా నేమో దానియందలి లక్షణములీ చట్టము నిర్మించిన కేందరాష్ట్రీయ ప్రభుత్వములం దున్నవాయనియు పరిశీలింపవలెను.

బిటిషు సామ్రాజ్యములోని అధినివేశ రాజ్యములగు కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రాజ్యములందును, ఇంకను మరికొన్ని రాజ్య భాగములందును బాధ్యతాయుత స్వపరిపాలనము అనబడు ప్రజాప్రభుత్వపద్ధతి అమలులోనున్నది. ఆ దేశముల వరిపాలనకొరకు బ్రిటీషు పార్లమెంటువారు చేసిన