172
భారతదేశమున
పక్షములవారి మద్దతుతో ప్రభుత్వమునందు సర్వాధికారిగా నుండు గవర్నరు జనరలు తన విశేషాధికారములను చలాయించి బందోబస్తు చేయుటవలన మామూలు బాధ్యతాయుత పరిపాలనమనునది అదృశ్యమగుటవలననే కావచ్చును.
బాధ్యతాయుత ప్రజాపరిపాలనకు ముఖ్యమైన ఆవశ్యకతలలో బలమైన రాజకీయపక్షముండుట యొకటి. ఒక్క కాంగ్రెసుతప్ప భారతదేశమం దట్టి రాజకీయపక్షములేదు. ఈకాంగ్రెసు ఈ రాజ్యాంగప్రణాళికను నడపుటకిష్టపడుటలేదు. తమలోని అధిక సంఖ్యాకపక్షీయుల పరిపాలనను హర్షించు జాతీయైక్యతగల ప్రజకూడ బాధ్యతాయుత ప్రజాపరిపాలన కత్యంతావశ్యకము జాతి మత భేదములు, కులకక్షలు నున్నప్పు డట్టి అధికసంఖ్యాకపక్ష ప్రభుత్వము (మెజారిటీ పరిపాలన) చాలా కష్టసాధ్యము. లేదా దుస్తరముకాక తప్పదు. అల్ప సంఖ్యాకులను సంరక్షించుటకు చేయబడు రక్షణలు బాధ్యతాయుత ప్రజాప్రభుత్వమునకు పూర్తిగా భంగము కలిగింపకపోయినను చాలవరకు దానిలాభములను తగ్గించితీరును. రాష్ట్రీయ గవర్నరులు తమ ప్రత్యేక బాధ్యతలను, విశేషాధికారములను చలాయించినచో బాధ్యతాయుత ప్రజాపరిపాలనము వర్ధిల్లనే వర్ధిల్లదు. వారట్లు చలాయింపనిచో తమ వోటు హక్కును చక్కగా ఉపయోగించుకొనుటకు వలసినంత రాజకీయాభివృద్ధిని గాంచని జనసమూహములకు లేదా, పలుకుబడిని సంపాదించి లాభమును పొందలేని బీద ప్రజూసమూహములకును చాల అన్యాయముకలుగవచ్చును. అందువలన నిజమైన