42
భారత దేశమున
జ్ఞుడు. సామాన్యసైనికులతోపాటు కష్టముల కోర్చుకొనును. అతనితర్వాత రాజ్యాధిపత్యము వహించిన బాలాజిరావుకుగూడ మంచిరాజనీతికౌశలము యుద్ధమధ్యమున దేశపరిపాలనను చక్కగా నడిపిన దిట్టరి. అతనికాలమున ప్రజలస్థితి యింకనుఅభివృద్ధి గాంచెను. దేశాదాయము వసూలు, వేలముపాటలు వేయు యిజారా పద్దతి నితడు మాన్పెను. న్యాయ విచారణ జనసామాన్యమునకు సులభసాధ్యము జేసెను. బాలాజీరావు తరువాత పరిపాలకుడైన మధోరావు యుద్ధమునందెంత చతురుడో పరిపాలనమం దంత సమర్థుడు.
ఈ కాలమున భారత దేశమం దంతటిలోను మహారాష్ట్రదేశ మత్యంత ఔన్నత్యము ననుభవించుచుండెను. మధోరావు మంత్రి, సుప్రసిద్ధుడగు రామశాస్త్రి. అతని ధర్మ నిర్నయములు తీర్పులు నేటికి ప్రమాణములుగా నున్నవి. అత డెంతో శ్రద్దవహించి జనసామాన్యమున కెల్ల మేలొన గూర్చెను. ఒకరోజుకు కావలసిన దానికన్న నెక్కువ ఆహార సామగ్రి నుంచుకొనుట కీ సద్ధర్ము డంగీకరింప కుండెను. (Grant Duff's History of the Mahrattas Vol.II 208)
పీష్వాయొక్కరాజ్యములను నానాఫర్నవీసు ఇరువదైదేండ్లు అత్యంతసమర్ధతతో పరిపాలించెను. ఇతడు తన చాకచక్యమువలన బుద్ధికుశలతవలన ఆవిశాల సామ్రాజ్యము నతి చతురతతో పరిపాలించెనని అతని ధర్మపద్ధతులను సత్పరిపాలన న్యాయపరిపాలనలను సర్ జాన్ మాల్కం చక్కగా వర్ణించి యున్నాడు. “దక్షిణమహారాష్ట్ర జిల్లాలయం దంత చక్కనికృషి