Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

భారతదేశమున


పరిపాలన శాఖలను పోషించుటకొరకు విద్య మొదలగు జాతీయాభివృద్ధి కరములగు శాఖలు సొమ్ములేక మాడ్చియుంచబడుచున్నవి. దేశముయొక్క మొత్తము రివిన్యూ ఆదాయములో నూటికి 25 వంతులు సైన్యములకొరకు ఖర్చుచేయబడుచున్నది. దానితో సమాన మొత్తమే శాంతి భద్రతలకొరకని వినియోగము చేయబడుచున్నది. మొత్తము రెవిన్యూలో నూటికి 6 వంతులు మాత్రమే విద్యకొరకును 2 వంతులు మాత్రమే వైద్యము కొరకును ఖర్చు పెట్టబడుచున్నవి.

ప్రాతరాజ్యాంగములో ప్రచ్ఛన్నముగాను గోప్యముగాను నుంచబడిన ఉద్దేశములు క్రొత్తరాజ్యాంగమున ప్రత్యక్షముగా నుదాహరించబడినందున ఈ క్రొత్తరాజ్యాంగము 1919 సంవత్సరము నాటికి ప్రాతరాజ్యంగముకన్నను కఠినతరముగా నున్నదని చెప్పవచ్చును. ముఖ్యముగా వైస్రాయికిని గవర్నరులకును ఇకముందు “ప్రత్యేక బాధ్యతలు" అనుపేరున అపరిమితములైన అధికారము లొసగబడినవి. శాసనములను ప్రత్యాఖ్య చేయుటకు వారికిగల 'వీటో' అధికారమునకు తోడు వారు శాసనసభలతో నిమిత్తములేకుండా స్వయముగాకూడా చట్టములు శాసింపగలుగుదురు. ఇట్టి అధికారము 1919 రాజ్యాంగములో వీరికి లేదు. ప్రాతరాజ్యాంగముక్రింద దేశ ద్రవ్య (ఫైనాన్సు) విషయములందు శాసనసభల అధికారము పైనగలహద్దులు అట్లే యుంచుటయేగాక, ఇక ముందు ఏశాసన సభయుగూడ భారతదేశ వర్తక పరిశ్రమలకు సహాయముగాని ప్రోత్సాహముగాని చేయుటకు వీలులేకుండా నూతన రాజ్యం