Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

భారతదేశమున


యము గలవారుగా నున్నారు. అందువలన నీలెక్కప్రకారము నెల 1 కి రు 5-0-0 కన్న మనిషికి ఆదాయము వచ్చుటలేదు.

ఇండియన్ మెడికల్ సర్వీస్ డైరెక్టరు జనరలుగారైన సర్. జె. డబ్లీయు. డి. మేగాగారు ఇటీవల చేసిన పరిశోధనల వలన నీక్రిందిసంగతులు బయల్పడినవి:-

(1) భారతదేశప్రజలలో నూటికి 39 మందికి మాత్రమే కడుపునిండకూడుకలదు. 41 మంది అర్ధాకలితో జీవించుచున్నారు. 20 మంది పూర్తిగా మాడుచున్నారు.

(2) మనప్రజల సగటు ఆయుర్దాయము నిజముగా నుండవలసిన దానిలో సగముగానున్న ది.

(3) కఱవులును అట్టిక్షామస్థితియు పదేండ్లలో నైదూళ్లలో నొక యూరికి తటస్థించుచునే యున్నది.

(4) మరణసంఖ్య ఇంత హెచ్చుగానున్నను జనసంఖ్య హెచ్చుచునే యున్నది.

భారతదేశములో వేయిమందికి 24.5 మరణించుచున్నారు. కెనడాలో వేయింటికి 10.7 మంది మాత్రమే మరణించుచున్నారు..

మనదేశములోని ప్రజల దామాషా ఆయుర్దా యము 26.7. ఇంగ్లాండులోని జనుల దామాషా ఆయుర్దాయము 57.6.

ప్రపంచములోని నాగరకతగల దేశములం దన్నిటిలోను నూటికి 80 మంది చదువను వ్రాయను నేర్చియుండగా మనదేశములో నూటికి 8 మంది మాత్రమే అక్ష రాస్యులు.