పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

భారతదేశమున

ఈ కాలములోనే ఇంగ్లాండుప్రజల మరణములు వేయిమందికి 20 నుండి క్రమక్రమముగా 16 కు తగ్గెను. దీనిభావమేమి?

1905 నాటికి ఇంగ్లాండుప్రజల ఆదాయము తల 1 కి 42 పౌనులు; మన దేశప్రజల ఆదాయము ప్రభుత్వము అంచనా ప్రకారమే 2 పౌనులు; ఉద్యోగేతరుల అంచనా ప్రకారము 1 పౌను మాత్రమే! ఇంగ్లాండు దిగుమతులు తల 1 కి 13 పౌనులుండగా భారతదేశ దిగుమతులు తల 1కి 5 షిల్లింగులు మాత్రమేయుండెను. ఆదేశముతో వారికి 1480 లక్షలపౌనులు సేవింగ్సుబాంకీ నిలువలుండగా వారికన్న ఏడురెట్ల జనసంఖ్యగల మనదేశములో 70 లక్షలు మాత్రమేనిల్వ యున్నవి. వారి జాయింటుస్టాకు కంపెనీలపెట్టుబళ్లు 19000 లక్షల పౌను లుండగా మనవారికి 260 లక్షలేయుండెను. ఈదేశప్రజలలో --5 వంతులకు వ్యవసాయము పైన జీవనాధారము. ఈ వృత్తి నానాటికి క్షీణించి లాభము లేకున్నది. ఇంగ్లాండులో యకరమునకు పండుదానిలో నాలుగవవంతు మాత్రమే ఇచ్చట పండుచున్నది. గత 8 సంవత్సరములలోను కఱవుల వలన 20 కోట్ల పౌనుల విలువగల పశువులు పంటలు నాశనమైనవని కఱవుల విచారణసంఘమువారు నిర్ణయించినారు. ఇంపీరియల్ గెజిటీరు సంపాదకుడగు సర్ విలియమ్ హంటరుగారు ఈ దేశములో 4 కోట్ల ప్రజలకు రోజుకు 1 పూట మాత్రమే తిండితినుటకు శక్తి కలిగియున్నారని వ్రాసినారు. సర్ చార్లెస్ ఇలియట్ గారు 7 కోట్ల మంది. ఎల్లప్పుడును అర్ధాకలితోనే మాడుచుందురని వ్రాసియున్నారు.