ఈ పుట ఆమోదించబడ్డది
138
భారతదేశమున
II
ఈదేశాదాయము ఈ వ్యయము నిజముగా భారతదేశ ప్రజల క్షేమలాభములు దలంచియే బ్రిటీషువారు చేసిరా? నిజముగా మనదేశము అభివృద్ధి గాంచినదా? అన్నప్రశ్నకు జవాబు రాజకీయములందు మితవాదిగనేయుండి గొప్పదేశభక్తుడై ప్రభుత్వమువారి గౌరవమునకు పాత్రుడైన కీ. శే. గోపాలకృష్ణ గోఖలేగారు 1908 లో శాసనసభయందు చెప్పిన సంగతులే నుదాహరించెదను.
దేశము | వివిధదేశముల ప్రజల దామాషా ఆదాయము తల 1కి సాలుకు | దేశములో భూములపైనవచ్చు మొత్తము ఆదాయములోభూమిపన్ను నూటి కెన్నివంతులు? | సాలు 1కి తల 1కి విధింపబడు ఉప్పు పన్ను ఎన్నిరోజుల ఆదాయమునకు సరిపడినది? |
ఇంగ్లాండు | 42.0 | 8.3 | - |
ఫ్రాన్సు | 25.7 | 4.8 | 1/2 రోజు |
జర్మనీ | 18.7 | 3.0 | 1 రోజు |
ఇటలీ | 12.0 | 7.0 | 4 రోజులు |
ఆస్ట్రియా | 16.3 | 4.9 | 1 1/8 రోజులు |
నెదర్లాండ్సు | 26.0 | - | 1/3 రోజు |
ఇండియా | 2.0 | 15 లేక 20 | 2 రోజులు |
"1902 మొదలు 1907 వరకు 5 సంవత్సరములకు అన్నిరాష్ట్రములందు కలిసి పల్లపుసాగు నీటివసతులు మురుగు