Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

133

iii 1856-1857 నాటికి భారతదేశ ప్రభుత్వముయొక్క మొత్తము ఆదాయము 3140 లక్షల రూపాయిలు; 1906-07 నాటికిది 10,840 లక్షలైనది. అనగా మూడురెట్లకు పెరిగినది. ఈఆదాయములో పన్నులవల్ల వసూలైన మొత్తము 1856-57 లో ఆనాటి 29 కోట్లరూపాయలును 1906-07 లో 64 కోట్ల 94 లక్షలకు అనగా రెట్టింపునకు పెరిగినది.

iv ప్రభుత్వముయొక్క మొత్తము వ్వయము 1856-57 లో 3,180 లక్షల రూపాయలు1906-07 లో 10,730 లక్షల రూపాయిలకు అనగా మూడురెట్లకు పెరిగినది. కేవలము భూమిశిస్తు ఈ కాలములో నూటికి 60 వంతులచొప్పున పెంచబడినది. ఎక్సైజు రివిన్యూ ఈమధ్యకాలములో 7 రెట్లకు పెరిగినది.

v. దేశముయొక్క విద్యాభివృద్ధి విషయములో 1833 కు 1853 మధ్య ఎట్టి కాలేజీలును లేవు. జాన్ బ్రూస్ నార్టన్ గారి లెక్క ప్రకారము 1853 నాటికున్న పాఠశాలలు:

- ఇంగ్లీషు (వర్నాక్యులరు) దేశభాషల బడులు కేవలము దేశభాషలవి.
వంగరాష్ట్రము 37 104
ఆగ్రా (నేటి సంయుక్తరాష్ట్రము) 7 -
మద్రాసు 1 -
బొంబాయి 14 233