Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

భారతదేశమున


సేకరించుటకు సర్ విలియమ్ హంటరుగారిని నియమింపగా 1880 నాటికి ఆయన ఇంపీరియల్' గెజిటీరు అను గొప్ప సంపుటములను చాలా తయారుచేసిరి. తరువాత నివి అచ్చై అనేక సంస్కరణములు పొందినది. 1871లో జనాభా లెక్క తయారు చేయబడినది. 1876 లోను 1893 లోను మద్రాసు ప్రభుత్వమువారును ఇతర ప్రభుత్వములవారును నివేదికలు ప్రకటించిరి. 1909 అక్టోబరులో ఇండియా గవర్నమెంటువారు పార్లిమెంటు వారికొక నివేదికను సమర్పించి దీనిలో భారతదేశ ప్రజలస్థితిని గూర్చి వర్ణించి గడచిన ఏబదేండ్లలోజరిగిన "అభివృద్ధి" ని వివరించిరి.

ఈ ప్రభుత్వములు భారతదేశ స్థితిగతులను గూర్చి ప్రకటించిన కొన్ని ముఖ్యాంశములు:-

i 1858లో తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేయబడి ఇంగ్లాండు పార్లమెంటువారి ప్రభుత్వము స్థాపింపబడిన పిదప రాజ్య విస్తీర్ణములో పెద్ద మార్పులేవియు జరుగలేదు.

ii 1858 నాటికి భారతదేశ జనసంఖ్య కేవలము ఊహలపైననే ఆధారపడియుండెను. 1871 లో మొదటి జనాభా లెక్కలను తయారుచేసిరి. అప్పటికి తేలిన జనసంఖ్య: 20,61,62,360. 1881లో రెండవ జనాభాలో సరియైన లెక్క 25,38,96,330. ఇది 1901 లో 29 కోట్లకు పెరిగినది.