పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

భారత దేశమున

ఈప్రజలు పూర్వపరిపాలకుల క్రిందనుండి నప్పుడు దుష్పరిపాలనము మితిమీరినచో నీప్రజలు తిరుగబడి ఆ పరిపాలకులను కూలద్రోయ గలుగుచుండిరి. కాని నేడు దాపురించిన క్రొత్తప్రభుత్వ మిట్లు కూలద్రోయ వీలైనదికాదు. అనాగరక ప్రాచీనప్రభుత్వములలో కెల్ల నన్యాయమగు నిరంకుశ ప్రభుత్వముయొక్క ప్రజాపీడనము ఆధునిక నాగరకత వలన విశేషపశుబలము కలిగిన ప్రభుత్వములలో కెల్ల బలమైన ప్రభుత్వముయొక్క పశుబలము గలిగియుండెను. అందువలన దీని గట్టిపట్టును ప్రజలు విడిపించుకో లేకుండిరి. (Macaulay's Essay on Clive.)

అయోధ్య

అయోధ్య చరిత్రయు పై విధముగనే యుండెను. అయోధ్య ఆంగ్లేయుల వశము గాక పూర్వము సుభిక్షముగ నుండెను. ప్రజల కెట్టి బాధయు లేకుండగనే సాలుకు మూడు కోట్ల రూపాయలు ఆదాయము వచ్చుచుండెను. నావిక సైన్యమును చాలమంది సివిలు ఉద్యోగులను పోషింపవలసిన భారమును నవాబుపై నాంగ్లేయులు విధించిరి. అంతట నీ ఖర్పు భరించలేక అతడు చిక్కులలో పడెను. దేశము పాడైపోయి దారిద్ర్యమున బడెను. అతని ఆదాయము సగమునకు క్షీణించెను. సాలుకు 34 లక్షల రూపాయలచొప్పున తొమ్మిది సంవత్సరము లీ దురదృష్ట రాష్ట్రమునుండి ఆంగ్లేయులు సొమ్ము