124
భారతదేశమున
కొంత క్రమక్రమముగా వృద్ధిచేయబడునట్లు ఏర్పాటుగావింపబడెనుగాని ఎట్టి సంస్కరణమును జరుగలేదు. ఈ ఉద్యోగుల కివ్వబడు నత్యధిక జీతములు వేతనములు అలవెన్సులు దేశమునకు చాలా భారముగానున్నవి. ఉద్యోగులు సర్కారు నౌఖరులుగానే ప్రవర్తించుచున్నారు గాని ప్రజాసేవకులుగా ప్రవర్తించుటలేదు. మనదేశములో నున్నంత హెచ్చు జీతములు ప్రపంచములో నెచ్చటను లేవు[1]. మాంటేగ్యూ సంస్కరణములు వచ్చినపిదప జీతములు తగ్గించుటకు బదులు హెచ్చిపోయెను. క్రొత్తయుద్యోగములు నిర్మింపబడెను. భారతీయ ఉద్యోగుల జీతములు హెచ్చు చేయబడెను. దీనికి కారణములేకపోలేదు. రాజకీయాందోళనము నానాటికి ప్రబలు చున్నందున నీయుద్యోగులు ప్రభుభక్తి గలిగి యుండులాగునను ప్రభుత్వోద్యోగము తక్కిన అన్ని వృత్తులకన్నను లాభకరముగా నుండులాగునను చేయదలంచిరి. దీనివలన ప్రభుత్వవ్యయము మితిమీరినది. పన్నులభారము వృద్దియైనది. ఋణమధికమైనది. తరువాత జరిగిన రాజ్యాంగ సంస్కరణముల వలన ఈ రాజ్యాంగ స్వరూపమున గొంత మార్పు చేయబడినదేగాని స్వభావమున నెట్టి మార్పులు జేయబడలేదు.
1931-32 లో నాటి ఇండియాప్రభుత్వ పైనాన్సు మెంబరు సర్ జార్జి షష్టరుగారు బడ్జెటు ఉపన్యాసములో రైళ్ళశాఖ తప్ప మిగతా అన్ని సివిలు శాఖలందుకలిపి గుమాస్తాలనుండి ఐ. సి. ఎస్. ఉద్యోగులదాకా చిన్న పెద్ద ఉద్యోగులందరి
- ↑ వివిధదేశముల ఉద్యోగుల జీతముల పట్టిక అనుబంధమున గలదు.