పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

123


రెండు శాసనసభలును ప్రభుత్వ వ్యయమున పొదుపు చేయవలెనని సలహానిచ్చెను. అంతట ఇంచ్కేపు కమిటీ నియమింపబడెను. సైనికవ్యయము తగ్గింపుమనిరి. రైల్వేవ్యయము తగ్గింపుమనిరి. సామాన్య పరిపాలనములో కూడతగ్గింపులు సూచించిరి, గాని దీనిప్రకారము జరుగలేదు.

మాంటేగ్యూ సంస్కరణచట్టము ప్రకారము ప్రభుత్వోద్యోగములందు భారతీయుల నధికముగా నియమించుటయే ఉదేశ్యమని చేసిన ప్రకటనను అమలులో పెట్టుటనుగూర్చి విచారించి సలహానిచ్చుటకు “లీ కమీషన్" అను విచారణ సంఘమువారు నియమింపబడిరి. వారు 1923లో తమ నివేదికను ప్రకటించిరి. అఖిల భారత ప్రభుత్వోద్యోగ పరీక్షలు చేసి అభ్యర్థులను నియమించుట కొక పబ్లికు సర్వీసుకమీషను ఏర్పాటు గావింపవలెననిరి. ఐ. సి. యస్. లో పోలీసుశాఖలోను ఇంగ్లీషు ఉద్యోగులతో సమానసంఖ్యగల భారతీయులు నియమింపబడవలెననిరి. అయితే వీరుచెప్పిన మార్గముద్వారా ఆ స్థితి వచ్చునప్పటికి ఐ. సి. యస్. లో 15 సంవత్సరములును, పోలీసు శాఖలో 25 సంవత్సరములును పట్టును. ఈ కమిషనువారు ఫారెష్టు సర్వీసులో నూటికి 75 మంది భారతీయులు, ఇంజనీరు శాఖలో 60 మంది ఉండవలెననిరిగాని రాజకీయశాఖలో మాత్రము నూటికి 25 మంది మాత్రమే ఉండునట్లునిర్ణయించిరి. దీనికి కారణము బ్రిటిష్ సామ్రాజ్య తత్వమున కిది ఆయువుపట్టుగా నుండుటయే.

ఇట్లు భారతదేశ ఉద్యోగములందు భారతీయుల సంఖ్య