122
భారతదేశమున
లలో భారతీయుల నంతగానియమించుట మంచిదిగాదనియు, ఇకకొన్ని శాఖలలో కొంత ఎక్కువసంఖ్య భారతీయులను నియమింపవచ్చుననియు తీర్మానించిరి. ఇల్లు తెల్ల వారి జీతములు తగ్గలేదు; భారతీయుల సంఖ్యయైనను హెచ్చలేదు.
వీరుపరిశీలించిన 24 ఉద్యోగవర్గములందును కలిసి 9949 మంది ఉద్యోగులుండిరి. దీనిలో 4140 మంది. అనగా నూటికి 42 వంతులు ఇంగ్లాండులోనే నియమింపబడుచుండువారు. ఈశాఖలలో నెల 1కి రూ 200 రూపాయిలు తక్కువగాని జీతములవారు 11064. దీనిలో నూటికి 42 వంతులు మాత్రమే భారతీయులు నెల 1కి 500 లకు జీతము తక్కువగాని యుద్యోగములసంఖ్య 4984. వీనిలో నూటికి 19 మంది మాత్రమే భారతీయులు. నెల 1కి రు 800 లకు తక్కువగానిసంఖ్య 2501. వీరిలో నూటికి 10 మంది మాత్రమే భారతీయులు. సర్ అబ్దుర్ రహముగారు ఈ విచారణసంఘములో నొక సభ్యులు, పాపము, వారు తమ అసమ్మతిని సూచించిరి. ఇండియన్ సివిలుసర్వీసులో 1350 మంది తెల్లవారును, 61 మంది మాత్రమే భారతీయులు నుండుటనుగూర్చి విచారించి ఇంగ్లాండులోను భారత దేశములోను ఐ. సి. యస్. పరీక్ష యొక్కసారిగా జరుపుట యవసరమనిరి.
భారతదేశ ప్రభుత్వ వ్యయము మితిమీరి, 1922-23 నాటికి సాలు 1 కి 32 కోట్లు రూపాయిలులోటు కలుగుచుండెను. ఆ సాలున 29 కోట్లు పన్ను విధించినను 3 కోట్లు లోటు కలిగినది. ఐదుసంవత్సరములలో 100 కోట్ల లోటు కలిగినది.