Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

121


ii ఈ లెక్కలో సాలు !కి 100 పౌనులు అనగా రూ 1500 లు పై బడినజీతములు మాత్రమే చేరినవి.

iii. ఐరోపావారి జీతముమాత్రమే చేరినది. ఇంగ్లాండులో పింఛను పుచ్చుకొన్న ఐరోపావారి కిచ్చు అలవెన్సులు చేరలేదు.

iv. సాలు 1 కి 100 పౌనులుకు తక్కువ జీతములుగల సోల్జరులు జీతములు చేరలేదు.

v. మఱియు ఇటీవల ఐరోపావారి సంఖ్య హెచ్చినది.

vi రూపాయివిలువ తగ్గినందున వారికి కంపెన్సేషన్ అలవెన్సులుకూడ ఇవ్వబడుచున్నది.

అని శ్రీరమేశచంద్రదత్తుగారు తమ భారతదేశ ఆర్థిక చరిత్రలో వ్రాసియున్నారు. [1]1893 నాటికి ఐ. సి. యస్. వగైరా ఆంగ్లేయులకు ఇజారా హక్కుగలఉద్యోగములందు 950 మంది తెల్లవారు 20 మంది భారతీయులు నుండిరి.

పెద్దజీతములుగల గొప్ప యుద్యోగములందు భారతీయులకు ప్రవేశము కలిగింపుడని భారతీయులు చాలా కాలమునుండి ఆందోళనము చేయగా చేయగా 1917లో నొకవిచారణసంఘము నేర్పరచిరి. వారు ఐ. సి. యస్. పోలీసు మొదలగు 24 రకముల ఉద్యోగవర్గములను గూర్చి తమ అభిప్రాయముల సూచించిరి. పర్యవసానమేమనగా భారతదేశ పరిపాలన బాధ్యతను చక్కగా నిర్వర్తించుట కొఱకు ఐ . సి. యస్ . పోలీసుశాఖ

  1. ఇంకను వివరములకు 83-84 పుటలు చూడుడు.