బ్రిటీష్‌రాజ్యతంత్రము
119
టరీ, పబ్లికువర్క్సు సెక్రటరీల నలుగురకు నలుగురు అసిస్టెంటులు పదవులు గెజిటెడ్ ఉద్యోగములుగా చేయబడినవి. అనగా నీపదవులలో సామాన్య ఉద్యోగులు నియమింప వీలుకలదు. 1871నాటి కిట్టిసామాన్య ఉద్యోగవర్గమునందు 16 వేలు ఉద్యోగులుండిరి. ఇంతకన్నను చిన్నతరగతి ఉద్యోగులు 80 వేలమందియుండిరి.
ఒడంబడికలులేని ఈసామాన్యఉద్యోగవర్గములో న్యాయవిచారణ రివిన్యూ శాఖలందలి ప్రధానపదవులు డిప్యూటీకలెక్టరు, తహ్సీలుదారు, డిప్యూటీ తహ్సీలుదారు, సబ్ జడ్జీ, జిల్లా మునసబులు. ఈ ఉద్యోగవర్గము అన్‌కవనెంటెడ్ సర్వీస్‌లో నాంగ్లేయులు చేరుట క్రిష్టపడరు. ఇది 'నేటివ్ సర్వీసు' అని కూడ వ్యవహరింపబడెను. దీనిలో నెల 1కి 250 మొదలు 600 వరకు జీతములుగల డిప్యూటీ భలెక్టరులు 68 మంది; నెల 1కి 150 మొదలు రూ 250 వరకు జీతముగల తహస్పీలుదారులు 156; నెల 1కి రు 50 లు మొదలు రూ 150 వరకు జీతము గల డిప్యూటీ తహస్సీలుదారులు 178; నెల 1కి రూ 500లు చొప్పున జీతము గల సబ్ జడ్జీలు 14; నెల 1కి రూ 200 మొదలు 300 వరకు జీతముగల జల్లా మునసబులు 110.
ఇతర ఉద్యోగములు:
ఇక ఇతరశాఖలలో అక్కవుంటుశాఖ, విద్యాశాఖ, రిజస్ట్రేషను, స్టాంపులు, వైద్యము, పోలీసు, జైళ్లు, పబ్లికువర్క్సు , రైళ్లుశాఖ ఒడంబడకలులేని సెక్రబేరియటులు లో