పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

భారతదేశమున


నేటి హైకోర్టులు స్థాపింపబడినవి. నేడు మేజస్ట్రేటులకు, సెషన్సు కోర్టులకు క్రిమినలు ప్రొసీజరు పీనలుకోడ్డు ధర్మప్రమాణములు, సివిలువ్యవహారములుకూడ శాస్త్రబద్దములు చేయబడి జిల్లాజడ్జి, సబుజడ్జి, మునసబుకోర్టులు స్థాపింపబడినవి.

IX

'నేటివ్' సివిల్ సర్వీస్ (ఉద్యోగవర్గము )


ఇంగ్లాండులో నియమింపబడు కవనెంటెడ్ సివిల్‌సర్వీస్‌వారుగాక అట్టి ఒడంబడికలులేని (అన్‌కవనెంటెడ్ సివిల్ సర్విస్ 1886-1887 తరువాత దీనికే రాష్ట్రీయసివిల్ సర్వీస్ అనిరి.) సామాన్య సివిల్ శాఖలోని ఉద్యోగులలో నెల 1 కి రూ 10 లు మొదలు అంతకు పై బడిన జీతములవారు కలరు. పార్లమెంటువారు 1793 లో చేసిన శాసనము ప్రకారము పైనచెప్పబడిన ఒడంబడికల ఉద్యోగవర్గము తప్ప యితరు లెవ్వరు. కంపెనీ క్రింద ఉద్యోగులుగా నియమింపబడ రాదని శాసింపబడి యున్నందున ప్రభుత్వమువా రప్పుడప్పుడు నియమించుచునచ్చిన ఈ తరగతి ఉద్యోగములు అశాస్త్రీయములుగను ఆస్థిరములుగను నుండెను. మద్రాసులో 1859 లో డిప్యూటీక లెక్టర్లనబడు నొక హోదా నిర్మింపబడెను. అప్పుడే టౌను మేజస్ట్రేటు పదవులు, స్మాలుకాజు జడ్జీ పదవులు భారతీయులకు ప్రవేశమివ్వబడెను. 1861 సంవత్సరపు సివిల్ సర్విసెస్ ఆక్టువలననే ఈ యుద్యోగములకు స్థిరత్వమేర్పడెను. 1876 నాటికి చీఫ్ సెక్రటరీ, రివిన్యూ సెక్రటరీ, మిలిటరీ సెక్ర