పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

117


పైన క్రిమినలు అప్పీళ్లను విచారించుచు, తాబేదారీ కోర్టులపైనను మేజస్ట్రీటులపైనను అధికారము కలిగియుండి 'సదరు నైజమత్ అదాలత్‌' అనగా ప్రధాన క్రిమినలు అప్పీలు కోర్టుగా వ్యవహరింపబడిరి.

1773 లో కలకత్తా సుప్రీముకోర్టు, ఒక ప్రధాన న్యాయమూర్తి యితర న్యాయాధిపతులు గలట్టిది స్థాపింపబడి మేయరు కోర్టులు రద్దుచేయబడెను గాని రిక్వెస్టుకోర్టులు జరుగుచునే యుండెను. 4 వేలరూపాయలు పైబడిన కేసులలో ప్రేవీకవున్సిలుకు అప్పీలు అధికారము లివ్వబడెను. సుప్రీము కోర్టులో అమలుజరిగిన సివిలు క్రిమినలు శాస్త్రధర్మము ఆంగ్లేయులదే. వ్యవహార విధులు కూడ ఇంగ్లీషువారివే. అదాలత్ కోర్టులకు ఆంగ్లధర్మము తెలియదు. వారికి తోచిన మంచిపద్ధతుల న్యాయము ధర్మము ప్రకారము, హిందూమహమ్మదీయ ధర్మముప్రకారము, రెగ్యులేషనుల ప్రకారము, న్యాయవిచారణ జరుపవలెనని విధింపబడెను. ఇట్లు పరస్పరవిరుద్ధముగా నుండిన కోర్టులు చిక్కులకు కారణమయ్యెను. సుప్రీముకోర్టు విచారణాధికారము కౌన్సిలు మెంబర్లకు వర్తించదని 1781 లో శాసింపబడెను. కంపెనీవారి మామూలు కోర్టులు శాస్త్రసమ్మతము చేయబడినవి. మరియు గవర్నమెంటు రివిన్యూరెగ్యులేషనులపైన సుప్రీముకోర్టుకు అధికారము లేకుండ చేయబడెను, మదరాసు బొంబాయిలలో కూడ 1801, 1823 నాటికి మేయరు కోర్టులు తీసివేయబడి రికార్డరుకోర్టులు స్థాపింపబడెను. 1861 లో ప్రాతసదరుకోర్టుల పద్ధతి తీసివేయబడి