Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

భారతదేశమున


పరిష్కరించిరి. నాలుగువేల రూపాయల లోపు వానికి ప్రెసిడెన్సీ రాజధాని గవర్నమెంట్లకు అప్పీలుండెను. నాలుగువేల రూపాయలు పైబడిన వానికి ప్రీవీ కౌన్సిలుకు రెండవ అప్పీలుకూడనుండెను. 1753లో నాంగ్లరాజువలన కోర్టుఆఫ్ రిక్వెస్టులు అనబడునవి స్థాపింపబడి 20 రూపాయలకు మించని కేసులు డైరెక్టర్ల అధికారము క్రింద విచారించుచుండెను. దేశములోపల ప్రాతమొగలాయి కోర్టులు కొన్నాళ్లు జరిగినవి.

1772 లో వార౯ హేస్టింగ్సు 'దివానీ అదాలత్తులు' అనబడు సివిల్ కోర్టులను జిల్లాలలో ఐరోపా జడ్జీలతో స్థాపించెను. వీరికి హిందూమహమ్మదీయ న్యాయాధికారులు సహాయముచేయుచుండిరి. అల్పపుకేసులు విచారించుటకు "నేటివులు" (భారతీయులు) సదరమీనులుగను, మునసబులుగను నియమింపబడుచుండిరి. వీనిపైన ప్రొవిన్షియలు సివిలుకోర్టులు నలుగురు జడ్జీలుగల రాష్ట్రీయ సివిలుకోర్టులు నిర్మింపబడి వానికి అప్పీలు అధికారము నివ్వబడెను. ఈ అన్నికోర్టులపైన 'సదరు దివానీ అదాలత్తు' లేక ప్రధానసివిలు అప్పీలుకోర్టు సభాయుతుడగు గవర్నరు అయిదుగురు నేటివు అధికారులు కలిసినది స్థాపింపబడెను. నేరవిచారణలకు మొగలు కోర్టులు తీసివేయబడి రాష్ట్రీయ క్రిమినలుకోర్టులు లేక 'నైజామత్ అదాలత్తు'లు నిర్మింపబడెను. వీనిలో మహమ్మదీయ న్యాయాధిపతులే పరివేష్టించుచుండిరి గాని కంపెనీయధికారులు పై తనిఖీచేయుచుండిరి. పైన చెప్పబడిన రాష్ట్రీయ సివిలు అప్పీలు కోర్టుజడ్జీలు సర్క్యూటుగా వచ్చి ఈకోర్టుల