Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

115


లుండెను. సబుడివిజనులలో తాలూకాలు, వానికి తహస్సీలుదార్లు నుండిరి. తాలూకా రమారమి 400 మొదలుకొని 600 చదరపుమైళ్లు వైశాల్యము. తహసీల్దారు రివిన్యూపని చేయగా, స్టేషసరీ సబుమేజస్ట్రేటులు అనబడువారు న్యాయవిచారణకు నియోగింపబడిన పద్దతిగూడ నెలకొల్పబడెను. గాని తాశిల్దారుకుగూడా క్రిమినలు అధికారములున్నందున పూర్వమునుండి రివిన్యూపరిపాలనలోని జులుము జరుగుచునే యున్నది. గ్రామోద్యోగులగు మునసబు కరణములు, రివిన్యూ ఇనస్పెక్టర్లు ఇతర సిబ్బందియు కలెక్టరు క్రిందవారే.

VIII

న్యాయవిచారణ కోర్టులు.

మొగలాయిరాజ్య కాలమున న్యాయవిచారణలో ఆనాటి ‘నవాబు నాజీం' ముఖ్యనేరములను, 'నాయబు నాజీం' తక్కిన కేసులను, “ఫౌజుదారుముహ్‌తవాశీలు కొత్వాలు' అనబడువారు చిల్లర కేసులను జిల్లా ముఖ్యస్థానములో విచారించు చుండిరి. దేశములోపల జమీందారులే విచారణాధికారము కలిగియుండిరి.

ఇంగ్లీషుకంపెనీకి 1683 లో న్యాయ విచారణాధికారము ఇవ్వబడి ఒకన్యాయవాది యిద్దరు ఆంగ్లవర్తకులుగల కోర్టులు నిర్ణయింపబడెను. 1726 లో న్యాయవిచారణాధికారము క్రమపరచుటయవసరమై డైరెక్టర్లు ఆంగ్లరాజు అధికారముపొంది కలకత్తా మద్రాసు బొంబాయిలలో మేయరుకోర్టులు, 9 మంది ఆర్డరుమన్లు మేయరు కలిసినవి, స్థాపించి, ఐరోపావారి వ్యాజ్యములు