బ్రిటీష్‌రాజ్యతంత్రము
111
ఇట్లు నియమింపబడుచుందురు. వీరికి జీతములు, సెలవుబత్తెములు ఫింఛను మున్నగువానిలో ప్రత్యేక సౌకర్యములు కలిగింపబడి వానికి ప్రత్యేకనిబంధనలు గావింపబడినవి. వీరిజీతములో నూటికి 4 చొప్పున పింఛనుకొఱకు మినహాయించి సీమకంపుదురు. వీరు చనిపోయినచో భార్యలకు అనాధలగు పిల్లలకు ప్రావిడెంటుఫండు గవర్నమెంటువలననే ఏర్పాటు గావింపబడినది.
“స్టాఫ్‌కోర్" అనబడు సైనికోద్యోగవర్గమొకటిగలదు. దీనిలో 559 ఆఫీసర్లుందురు. వీరు మిలిటరీసివిల్ కార్యనిర్వహణము కొఱకు కలిపి నియమింపబడిరి. దీనిలో 149 మంది ప్రత్యేకము సివిల్ పనులకు అనగా పొలిటికల్, పబ్లికువర్క్సు , పోలీసు, సర్వే, ఫారెష్టు శాఖలు, 410 మంది సైనికోద్యోగులుగా నుందురు. భారతదేశమంతలో నీతరగతి ఉద్యోగులు వారు 1200 మంది యుండిరి. ఒక్క మద్రాసురాజధానిలోనే కవనెంటెడ్ సివిలు సర్వీసు "స్టాఫ్‌కోరు" కలసి 300 మంది యుండిరి. ఈఉద్యోగులకు వేరే సెలవురూల్సు, పింఛనురూల్సు ఏర్పాటు చేయబడినవి.
VII
జిల్లాకలెక్టరు పరిపాలన
జిల్లాకలెక్టరు ప్రభుత్వముయొక్క ప్రతినిధిగానుండి ప్రజలదృష్టిలో నతడే సర్కారుగా పనిచేయును. వారి బాధలు తీర్చుటకు వారికి క్షేమము కలిగించుటకు నాతడే దిక్కు.