Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

భారతదేశమున


నాధీశుల రాజ్యములుకూడా ఇంగ్లాండు రాణీవైనందున ఇక నేభాగమును మరలకలుపుకొనుట యనునది జరుగదు; కాని తగుకారణమున్న చో నొకసంస్థానాధీశుని తొలగించి ఇంకొకరిని సింహాసనమున నిలుపవచ్చును. ఈ సిద్ధాంతము మేయోప్రభువు రాజప్రతినిధిగానుండినప్పుడు రాజుపుత్రస్థానములో ఆల్వారురాజు విషయమున తీసుకొనిన చర్యలో స్థిరపడెను. తరువాత నీయధికారమును పురస్కరించుకొనియే బరోడారాజు రెసిడెంటుకు విషప్రయోగము జేసెనని అతనిని పదభ్రష్టునిజేసిరి. ఇటీవల బావ్‌లా హత్య కేసువలన ఇందూరు