98
భారతదేశమున
ఇండియామంత్రికి భారతదేశపరిపాలనపైన సర్వాధికారముకలదు. ఇది యెట్టిదనగా నీదేశాదాయములో నొక దమ్మిడీయైనను ఖర్చుపెట్టవలెనన్నను ఈతనిఅనుజ్ఞను గవర్నరు జనరలు పొందవలెను. అయితే ఆచరణలో నెలకు 250 రూపాయిలకు లోబడిన జీతములు ఉద్యోగములును సాలుకు 25 వేల రూపాయిలకు హెచ్చుఖర్చుగాని ఉద్యోగవర్గపు ఏర్పాటులు మాత్రము ఇండియాగవర్నమెంటుకు వదలబడెను.
1858 సంవత్సరపు చట్టమువలననే భారతదేశముపైన బ్రిటీషుపార్లమెంటుకుగల సర్వాధికారము స్పష్టీకరింపబడినది. రాచరికపు హక్కులనుబట్టి ఆంగ్లరాజులకుగల అధికారములు, మొగలాయిసామ్రాజ్యచక్రవర్తులనుండి బ్రిటీషువారికి సంక్రమించిన సర్వాధికారములు, భారతదేశములోను ఇంగ్లండులోను రాజ్యాంగవ్యవస్థకుగల నీ యధికారములు పార్లమెంటుచట్టము ద్వారా స్థిరీకరింపబడినవి. గవర్నరుజనరలుకు అతని కార్యాలోచనసభకు గల సంబంధములు, కర్తవ్యములు, రాజధాని ప్రభుత్వములపైన అతనికిగల అధికారములు, (స్థానిక) రాష్ట్రీయ శాసనసభల యొక్కయు హైకోర్టుల యొక్కయు ఇండియా మంత్రియొక్కయు అధికారములు కూడ చట్టబద్దములు చేయబడినవి. భారతదేశమునకు పార్లిమెంటు వా రెట్టి చట్టమైన చేయవచ్చును. భారతదేశమునకు ఋణములు చేయుటకు ఇండియా మంత్రి కధికారమివ్వబడినది. సరిహద్దు సంరక్షణకొరకు తప్ప సైన్యముక్రింద వ్యయము చేయుటలో ఇండియాశాసనసభ యిష్టములేనిది పార్లి