బ్రిటీష్‌రాజ్యతంత్రము
97
కమిటీకి నుండిన అధికారము లన్నియు సంక్రమించినవి. భారత దేశములోని గవర్నరు జనరలు మొదలు క్రిందనున్న చిన్నయధికారులవరకు అందరు నీతనిఆజ్ఞలను శిరసావహించవలెను. ఈమంత్రి కొన్నిఅధికారములను స్వయముగానే చలాయించును. కొన్నిటిని తనసహాయము కొర కేర్పడిన కార్యాలోచన సభతోకలసి చలాయించును. కొన్ని రాజకీయ రహస్య విషయములు ఇతరముఖ్య వ్యవహారములు తప్ప తక్కిన వ్యవహారములన్నియు కార్యాలోచనసభ యెదుట పెట్టబడును. పూర్వము రహస్యకమిటీవారి ద్వారా బోర్డుఆఫ్ కంట్రోలువారు పంపు రహస్యపు తాఖీదులు స్వదేశ సంస్థాన వ్యవహారములు పైన చెప్పబడిన తరగతిలోచేరిన రాజకీయ రహస్య విషయములు. ఈ కార్యాలోచనసభలో 15 మంది సభ్యులుండిరి. అన్నివిషయములు మెజారిటీ తీర్మానము ప్రకారము జరుగుచుండెను. వ్యవహార బాహుళ్యమువలన అన్ని సంగతులు . కార్యాలోచనసభవా రందరునుకలసి ఆలోచించుట కష్టము గనుక ఫైనాన్సు(ద్రవ్య) రాజకీయ, మిలిటరీ, రివిన్యూ, స్థితిగతి లెక్కలు, న్యాయవిచారణ, పబ్లికుశాఖ, పబ్లికు వర్క్సు, స్టోర్సు అనబడు కమిటీలుగా విభజింపబడి ఈసభవారు పనిచేయుచుండిరి. పూర్వము బోర్డు ఆఫ్ కంట్రోలు కార్యాలయముక్రింద నుండినసిబ్బంది యావత్తు ఇండియామంత్రి కార్యాలయమునకు మార్చబడెను. క్రొత్తఉద్యోగములుకూడ నిర్మింపబడి వాని కర్తవ్యములు, జీతములు, ప్రీవీకవున్సిలు సభాయుతుడగు రాజు నాజ్ఞవలన నిర్ణయింపబడెను.