96
భారతదేశమున
మైనది. ఆచట్టమునుబట్టి భారతదేశప్రభుత్వ వ్యవహారముల నిర్వహణమునకు పార్లిమెంటుకు బాధ్యతవహించి ఇంగ్లాండు మంత్రి మండలిలో సభ్యుడుగానుండు ఒక రాజ్యాంగమంత్రి, (సెక్రటరీ ఆఫ్‌స్టేటు) నియమింపబడెను. ఇతని యధికారమునకు లోబడి ఆంగ్లరాజుపేరున భారతదేశపు గవర్నరు జనరలు రాజప్రతినిధిగా నీ దేశమును పరిపాలించునట్లు నిర్ణయింపబడినది. ఆప్రకారము నాటి ఇంగ్లాండు ఏలికయగు విక్టోరియారాణి 1858 లో భారతదేశమున తన పరిపాలనను ప్రకటించుచు నాటి గవర్నరు జనరలగు క్యానింగును రాజప్రతినిధిగా చేసెను. పార్లమెంటువారి సలహాతో విక్టోరియా "ఇండియా మహా రాజ్ఞి" అను బిరుదును 1876 లో శాస్త్రోక్తముగా ధరించగా 1877 జనేవరు 1 వ తేదిన ఢిల్లీ దర్బారులో నీ సంగతి ప్రకటింపబడెను.
ఇట్లు ఆనాటికుండిన 23 కోట్ల భారతీయ ప్రజలు గల భారతదేశభాగము “బ్రిటీషు ఇండియా"గా చేయబడి ఇంకను ఆనాటికిగల 6 కోట్ల జనసంఖ్యగలిగి స్వదేశసంస్థానాధీశులుక్రింద నుండిన భాగముతో కలిపి “బ్రిటీషు సామ్రాజ్యము"లో చేర్చబడి, ఇంగ్లాండురాజు లేక రాణి, కామస్సుసభ ప్రభువుల సభ కలిసిన 'పార్లి మెంటు' అనబడు బ్రిటీషు ప్రజూప్రభుత్వ సంస్థయొక్క తాబేదారీపాలిత రాజ్యముగా చేయబడినది. 1858 చట్టముక్రింద ఇంగ్లాండు పార్లమెంటుకు బాధ్యత వహించు ఇండియా మంత్రికి, పూర్వము కంపెనీ కాలమున బోర్డుఆఫ్ కంట్రోలువారికిని కంపెనీ డైరెక్టర్లకును రహస్య