పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

95


మద్రాసులో గాజుల లక్ష్మీనరుసుసెట్టిగారును ఇతరరాష్ట్రము లందు నితరభారతీయ ప్రముఖులును స్వదేశ సంఘములను స్థాపించి స్వధర్మరక్షణకొరకును, దేశప్రజలబాధలు బాఫుటకును దేశపరిస్థితులను దెలుపుచు కంపెనీ డైరెక్టరులకు, పార్లమెంటువారికిని అనేక మహజరులంపిరి. ఆనాటి ఆంగ్లేయులలో కూడ జాన్ బ్రూస్ నార్టన్, డేవిడ్ హేర్ మొదలగు కొందరు మహానుభావులు భారతదేశోద్ధరణకు పాటుబడసాగిరి, గాని లాభము కలుగలేదు. పార్లమెంటువారు వీరి మొరలను చెవినిపెట్టక 1853 లో కం పెనీవారికి మరల రాజ్యధికార పట్టానిచ్చిరి. ఇట్టి దుర్బరమైన స్థితిగతులలో దేశములో విప్లవాగ్ని బయలుదేరి 1857 లో స్వదేశరాజులు, నవాబులు, హిందూమహమ్మదీయ ప్రజలు, భారతీయ సిపాయిలు, నేకమై ఈ విదేశీయ పరిపాలన నంతమొందించుటకు స్వాతంత్ర్యసమరము జరిపిరి. గొప్పరక్తపాత మయినపిదప, ఇంగ్లాండు పార్లమెంటువారు కన్ను తెరచి కంపెనీ ప్రభుత్వమును రద్దుచేసిరి.

నేటి భారతదేశ పరిపాలనా విధానమునకు పునాది 'సిపాయి విప్ల' వానంతరము 1858 సంవత్సరమున ఇంగ్లాండుదేశపు పార్లిమెంటువారు చేసిన ఇండియా రాజ్యాంగచట్టమే. స్వరూపమున తరువాతకొన్ని మార్పులుజరిగినను దీని స్వభావము మాత్రము మారలేదు. దాని ప్రకారము భారతదేశమున నదివరకు జరుగుచుండిన తూర్పు ఇండియా కంపెనీయొక్క ప్రభుత్వము రద్దుచేయబడి ఆంగ్లరాజమకుటముక్రింద బ్రిటీషుసామ్రాజ్య పార్లిమెంటు ప్రభుత్వము ప్రారంభ