బ్రిటీష్‌రాజ్యతంత్రము
93
బాటులతో నీదేశప్రభుత్వమునకు అనగా నాటిరాజధానులు, కార్యాలోచన సంఘములు వాని గవర్నరులు గల వివిధ పరిపాలక వర్గములకు పైన కలకత్తా గవర్నరునే అధిపతిగా జేసి “గవర్నరుజనరల్ " అను బిరుదమునిచ్చిరి. 1773 లో వారన్ హేస్టింగ్సు మొదటి గవర్నరుజనరల్ అయ్యెను. ఈతడు దేశముయొక్క ఆంతరంగిక పరిపాలనము నందు కొన్ని కట్టుదిట్టములను చేసెను. అదివరకుండిన కలగలపు పద్ధతులను రద్దుచేసి ప్రతిజిల్లాకు నొక “కలెక్టరు"ను నియమించి ఆతనికే రెవిన్యూ, పోలీసు, న్యాయవిచారణాధికారముల నిచ్చెను. ఇదియే నేటి బ్రిటిషుప్రభుత్వ యంత్రముయొక్క పునాది.
ఇట్లు పార్లమెంటువా రీ దేశ ప్రభుత్వమును గూర్చి శాసనములు చేయుచున్నను, నిజముగా నీ దేశపరిపాలన మంతయు ఇంగ్లాండులోని తూర్పు ఇండియావర్తక కంపెనీ వాటాదారులయొక్క కార్యనిర్వాహక సంఘమగు "డైరెక్టరుల కోర్టు" వారి యధికారముక్రిందనే జరుగుచుండెను. ఇచ్చటి గవర్నరుజనరలు మొదలు క్రింది యుద్యోగు లెల్లరుకూడ నీకంపెనీ డైరెక్టరుల తాఖీదులను శిరసావహించవలసియుండెను. కంపెనీవా రీ దేశమును తమస్వంత జమీందారీగా వ్యవహరించుచు, నీ దేశపరిపాలనమును తమ స్వలాభముకొరకే జరుపసాగిరి. అన్యాయములు మితిమీరగా నీకంపెనీ పరిపాలనపైన కొంత పైతనిఖీచేయుటకు కంపెనీ డైరెక్టరులతోపాటు పార్లమెంటు మంత్రులుగల "బోర్డుఆఫ్ కంట్రోలు" అను