92
భారతదేశమున
ఉద్యోగులకు, గవర్నరు, గవర్నరు జనరలులకు, కార్యాలోచన సభల (ఎగ్జిక్యూటివు కవున్సిళ్ళ)కు ప్రాతిపదికలని చెప్పవచ్చును
కంపెనీవారు దేశాక్రమణచేయగనే, ఒక్కసారిగనే, నేటి ప్రభుత్వయంత్రమును స్థాపించలేదు. ప్రాతమొగలాయి ప్రభుత్వయంత్రమును, దానిలోని ప్రభుత్వోద్యోగులను వశముచేసికొని వారివలననే దేశముయొక్క రెవెన్యూ, (ఆదాయము) వసూలు, సివిలుపరిపాలన, పోలీసుపని, న్యాయవిచారణయు జరుపుచుండిరి. ఆనాటి (భారతీయ) “నేటివు" తహశీలుదారులు గ్రామోద్యోగులు నేటికిని నిలుపబడినారు. మొగలాయి కాలమునాటి “అమల్ గుజారు" లే నేటి జిల్లాకలెక్టరులయినారు. కొంతకాలమువరకు ఆనాటి ప్రాతభారతీయ యుద్యోగులపైన నీ కంపెనీవారి ఆంగ్లేయోద్యోగులు నౌఖరులు, పైతనిఖీచేయుచు, కొన్నాళ్లు జరిపిరి. తరువాత తామేస్వయముగా అధికారము వహించిరి. మద్రాసు మొదలగువానికి పైనచెప్పబడిన ప్రెసిడెంట్లు వలననే “ప్రెసిడెన్సీ” (రాజధాని) లనుపేరు వచ్చినది. నాటికి బొంబాయి, మద్రాస్ , కలకత్తా రాజధాను లొకదానితో మరియొకదానికిని వాని పరిపాలక వర్గములకును పరస్పరసంబంధములేదు. వర్తకము చేయుటకు వచ్చిన ఈకంపెనీవారిట్లు పరిపాలన చేయసాగినందున ఇంగ్లాండు దేశములో నీకంపెనీవారి ప్రభువులగు "బిటీష్‌పార్లమెంటువారు" 1773 లో నీదేశపు పరిపాలనా విధానమునుగూర్చి "రెగ్యులేటింగు ఆక్టు" అను నొక చట్టమునుచేసి కొన్ని కట్టు