Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

భారతదేశమున


15.2 వంతులు; సైనికవ్యయముక్రింద 39.5 వంతులు; సివిలు పరిపాలన జీతములకొరకు 39.2 వంతులు; ఖర్చుచేయుచున్నారు. అందువలన దేశాభివృద్ధి కత్యంతావశ్యకములగు విద్య, ప్రజల ఆరోగ్యము, పరిశ్రమలు, వ్యవసాయముల కొరకు భారతదేశ రాష్ట్రీయప్రభుత్వములు చేయువ్యయ మతిహీనముగానున్నది.

1928-1929 లెక్కలు[1]

మొత్తముఖర్చు తల 1కి ఎంత?

రాష్ట్రము (రూపాయలు) (రూపాయలు)
మద్రాసు 4 కోట్ల 25 లక్షలు 1
బొంబాయి 3 కోట్ల 7 లక్షలు 1 59/100 రూపాయలో వంతులు
వంగరాష్ట్రము 2 కోట్ల 73 లక్షలు 29/50 రూపాయలో వంతులు
సంయుక్తపరగణాలు 2 కోట్ల 98 లక్షలు 13/20 రూపాయలో వంతులు
పంజాబు 2 కోట్ల 90 లక్షలు 1 2/5 రూపాయలో వంతులు
బీహారు & ఒరిస్సా 1 కోటి 47 లక్షలు 21/50 రూపాయలో వంతులు
మధ్యరాష్ట్రము 1 కోటి 8 లక్షలు 77/100 రూపాయలు వంతులు
అస్సాము 58 లక్షలు 19/25 రూపాయలో వంతులు

దేశప్రజలు నానాటికి దరిద్రులై పోవుచున్నారు.[2] రైతులదుస్థితి వర్ణనాతీతము. వారుపన్ను లిచ్చుకోలేక ఋణమున

  1. Life and Experiences of a Bengali Chemist. Sir P. C. Ray. ఇది సర్ ప్రపుల్ల చంద్రరాయిగారి లెక్క.
  2. అనుబంధములో దేశస్థితిగతి లెక్కలపట్టికలను చూడుడు.