ఈ పుట ఆమోదించబడ్డది
88
భారతదేశమున
ఇతరదేశములతో పోల్చినచో నిది తక్కువగా కనబడినను దామాషా ఆదాయమునుబట్టి యత్యధికమే. తక్కిన దేశములలోవలె గాక మన దేశములో ధనికలకన్న బీదవారే నూటికి నలుబదివంతు లధికపన్ను భరించుచున్నట్లు ప్రొఫెసర్ షా ఖంబటాగార్లు తేల్చినారు. దీనికి కారణము బీదలను బాధించు భూమిపన్ను, ఉప్పుపన్ను అధికముగా నుండుట. ఇతరదేశములలో ఆదాయపుపన్ను, సుంకములు, అధికములు.
పన్నుల పద్దతి.
1928-29 లో మన దేశమునందలి పన్నులను, ఇంగ్లాండు జపానులలో విధించబడిన పన్నులను జూచినచో ఆయా విధానములలోని తారతమ్యము కనబడును. ఆ దేశములలో ధనికుల పైనబడు పన్ను ఎక్కువయు బీదవారిపైన బడునది తక్కువగ నుండగా మనదేశములో నందుకు విరుద్ధముగా నున్నది.
- | భరతఖండము | ఇంగ్లాండు | జపాను |
1. ఆదాయపుపన్ను (ఇన్‌కంటాక్సు) | 12.5 | 43.77 | 32.9 |
2.వారసత్వములపైపన్ను మరణములపన్ను | (లేదు) | 14.9 | (లేదు) |
3. భూమిపన్ను | 25.3 | .13 | (8.1) |
4. సుంకములు | 41.0 | 20.7 | 16.9 |
5. ఆబ్కారి | 13.9 | 20.5 | 42.1 |
6. నల్లమందు | 2.4 | (లేదు) | (లేదు) |
7. ఉప్పు | 4.9 | (లేదు) | (లేదు) |
పన్నుల విధానపు మొత్తము | 100 | 100 | 100 |