ఈ పుట ఆమోదించబడ్డది
82
భారతదేశమున
పోవుచున్నదను విషయమున కొంత యభిప్రాయభేదము కలదు. సాలుకు కొన్ని వందలకోట్ల రూపాయిలు పోవుచున్నవని మాత్రము అందరు నంగీకరించుచున్నారు.
1906 లో హైండ్‌మన్‌గారు సాలు 1కి 400 లక్షలు పౌనులని అంచనావేసినారు. విల్సన్ గారు 350 లక్షలనిరి. సర్ తియోడర్ మారిసన్ గారు 210 లక్షలని అంచనా వేసినారు.
ఈధనప్రవాహము మొత్తము సాలు 1కి 161 కోట్ల రూపాయలని ఒక అంచనా వేయబడి దానిని సర్ విశ్వేశ్వరయ్యగారు తమగ్రంథములో నుదాహరించినారు.
కోట్ల రూ లు | ||
బ్రిటీషు లేక ఇతరవిదేశీ ఓడల రేవులు నుంచి | 35 | |
బ్రిటీషు లేక ఇతరవిదేశీ బ్యాంకుల కమీషనులు | 21 | |
బ్రిటీషుజాతివారు వ్యాపారమువల్ల, జీతములవల్ల, పరిశ్రమలవల్ల పొందులాభము | 40 | |
బ్రిటీషువా రీ దేశములో పెట్టినపెట్టుబళ్లపైన సాలుకు నూటికి 5 చొ. వడ్డీ | 65 | |
వెరసి. | 161 |
మన దేశమునుండి ప్రతిసాలున ప్రవహించిపోవు ధన ప్రవాహము 219 కోట్ల 86 లక్షలరూపాయలని ఇంకొక అంచనావేయబడినది. ఇది ప్రొఫెసర్ షాగారు తమ ఆర్థిక శాస్త్రములో వేసిన లెక్క.