పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

81


సంవత్సరములనుండి పాటుపడుచున్నది. భారతదేశ ప్రజల ఘోర దారిద్ర్యమును నివారించుటకు వెంటనే కొన్ని ఆర్థిక సంస్కరణములనైన జేయవలసినదని బ్రిటీషువారిని మహాత్ముడు కోరియున్నాడు. వారు అట్లు చేయనందున ఇక నీ సామ్రాజ్యతత్వముతో సంబంధమున్నన్ని నాళ్లు ఈ దారిద్ర్యము తప్పదని గ్రహించి పూర్ణస్వరాజ్యముకొరకు సత్యాగ్రహ మారంభించెను.

ఇట్లు కంపెనీవారి కాలమున ప్రారంభమైనకొల్ల నేటికిని జరుగుచునేయున్నది. మనదిగుమతులకన్న ఎగుమతులధికము గానుండి ఈ ఎగుమతులెల్ల పకృతిసంపదకుజెందిన ముడిపదార్థములే యైనందున ఈ తేడాయంతయు మనకు నష్టము వారికిలాభకరము. కంపెనీకాలములోవలెనేడు దేశముయొక్క నికరాదాయమే ఇంగ్లాండుకు బహిరంగముగా పంపబడకున్నను ఉద్యోగులజీతములక్రింద సైన్యముక్రింద ప్రచ్ఛన్నముగానది పంపబడుచునేయున్నది. ఆంగ్లేయులకు ప్రత్యేకముగా వ్యాపార యిజారాలేకపోయినను నేటి ఆర్ధికపరిపాలనలోని బ్రిటీష్ సామ్రాజ్యలాభవిధానమువలన నా ఫలితమే సిద్ధించినది. ఇట్లు ఉద్యోగులజీతములు, పింఛనులు, విదేశవ్యాపారము, ఓడల కిరాయి, ఇన్షురెన్సు బ్యాంకింగు కమీషనులు, మారకము రైలుదారులు, రూపముగా నేటికిని ధనము సీమకుప్రవహించి పోవుచునేయున్నది. ఇట్లు ధనము నిరంతరముగా పోవుచున్న సంగతి భారతీయమితవాదులు, అర్ధశాస్త్రజ్ఞులు, తుదకింగ్లీషు వారుసైతము అంగీకరించుచున్నారు గాని ఎంత మొత్తము