Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

భారతదేశమున


లేకుండగ దిగుమతులుచేయు “ స్వేచ్ఛా వ్యాపార" పద్దతియు, బ్రిటీషు సామ్రాజ్యమువారికి సౌకర్యముల నిచ్చు "ఇంపీరియల్ ప్రిఫరెన్సు" పద్దతియుగూడ ఇంగ్లాండు దేశమునకే లాభకరములుగనున్నవిగాని భరతఖండమునకు నష్టకరములే యైనవి. మనరూపాయయొక్క బంగారు విలువను తమ కనుకూలమగు మారకపు పద్ధతి కనుగుణముగ నేర్పరచి లాభము పొందుచున్నారు. ఇంగ్లాండుదేశమునుండి మనదేశమున రైలుదారులనువేయుటకు ప్యాపారము చేయుటకును వచ్చిన వర్తకులు మనకు వ్యతిరేకముగ ప్రవర్తించుటయు వింతకాదు.

భారతీయుల ఆర్థిక పారిశ్రామిక విద్యాభివృద్ధికి భంగకరముగ అమితవ్యయమును దెచ్చిపెట్టిన బ్రిటిషుపరిపాలనా విధానము బీదలగు భారతీయుల కెంతమాత్రము తగదు. దీనియనర్థములు జగద్విదితములుగ ఉన్నవి. ప్రతిసాలున మన ఆదాయమునందు చాలభాగము సైన్యమే మ్రింగివైచుచున్నది. మన పరిపాలకోద్యోగుల వేతనము లత్యధికములుగ నున్నవి. ప్రపంచమున నేదేశమున నింత యమితముగ లేవు. ఈ దుర్వ్యయమునకు సొమ్ము చాలనందున జనసామాన్యము పైన మిక్కుటములగు పన్నులు విధించి పీడించుచున్నారు. ప్రపంచమునందలి నాగరక దేశములలో ధనికులను బాధించు ఆదాయపుపన్ను వారసత్వపుపన్ను అధికముగ విధింపబడి బీదలను బాధించు భూమిపన్ను సుంకములు తక్కువగ విధింపబడుచుండగ మన దేశమున మొదటిరకము తక్కువగను, రెండవరకము హెచ్చుగ నున్నది. భూమిపన్ను కర్షకుల నికరాదాయమున