Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

77


ప్రారంభించిన ఈఆర్థికలాభవిధానముకూడ నాటికిని నేటికిని మారలేదు.

VI

స్వతంత్రభారతము "బ్రిటీష్ ఇండియా"గా చేయబడిన పిదప భారతదేశప్రభుత్వస్వరూపమునం దెన్నిమార్పులు జరిగినను భారతదేశభాగ్యభోగ్యముల నింగ్లాండువారి లాభముకొరకు బ్రిటీషుసామ్రాజ్యస్వప్రయోజనముకొరకు వినియోగించుకొని ఈదేశప్రజల నధోగతిలోనికి దింపు రాజకీయార్థిక దాస్య పద్దతిలో మార్పుకలుగలేదు. బ్రిటీషుపరిపాలనావిధానమువలన భారతీయుల పూర్వపరిశ్రమలు నశించినవి. అందు ముఖ్యముగ నౌన్నత్యము జెందిన వస్త్రపరిశ్రమ నౌకాజీవనము ఇతరపరిశ్రమలు రూపుమాసినవి. ఇప్పటికి నుద్దరింప వీలుగల గ్రామపరిశ్రమలనైనను ప్రభుత్వమువా రుద్దరింపరైరి. క్రొత్తవానిని నెలకొల్పక యుపేక్షించుచున్నారు. అందువలన భారతీయు లార్థికాభివృద్ధిలేక సహజనంపదను గోల్పోవుచు ఏటేట కోట్లకొలది రూప్యముల విలువగల విదేశవస్త్రములు, ఇతర వస్తువులు గొనుచు నానాటికి బీదలగుచున్నారు.

భారతీయుల కార్థికస్వాతంత్యములేదు. భారతీయార్థిక పరిపాలనము బ్రిటీషువారి వ్యాపారశ్రేయమునే ముఖ్యలక్ష్యముగ జూచుకొనుచు బ్రిటీషుమంత్రి హస్తగతమైయున్నది. అందువలన భారతీయులకు నష్టకరములును బ్రిటీషువారికి లాభకరములునగు విధానములు దాపురించుచున్నవి. పన్నులు