66
భారతదేశమున
న్యాయములెల్ల కప్పిపుచ్చి వారిని సమాధాన పరచుచుండిరి. 1765 సం|| రం నాటికి కంపెనీవారికి దేశములోని రాజకీయములందుగూడ గొప్ప పలుకుబడి కలిగినది. అంతట వీరు మొగలుచక్రవర్తిని వంగరాష్ట్ర నవాబును జేబులో వేసికొని వంగరాష్ట్రమున 'దివానీగిరి' అనగా దేశాదాయము వసూలుచేయు హక్కును సంపాదించిరి. ప్రజలనుండి 132 లక్షలు వసూలుచేసి 26 లక్షలుమాత్రము దర్బారుకిచ్చి తక్కి నది వీరు జేబులో వేసికొను హక్కుపొందిరి. 1768 మొదలు 1770 వరకు దేశములో ఘోరక్షామమువచ్చి ఒక కోటిమంది చనిపోయినప్పుడుగూడ ఈ పన్నుల వసూలులో ఆవంతయైన తగ్గింపుచేయలేదు. కంపెనీవారును వారి ఇజారాదారులును అతిక్రూర విధానములచే అణా పైసలుతో వసూలుజేసిరి.
II
భారతదేశమునుండి సీమకు ధనము ప్రవహించుట
ప్లాసీయుద్దముతో భారతదేశమున నాంగ్లేయులరాజ్యాధిపత్యము స్థిరపడినది. ఈరాజ్యాధికారముల నుపయోగించి వారు మనదేశభాగ్యభోగ్యములను సీమకు గొనిపోవుట ప్రారంభించినారు. ఈవిధానము నాటికి నేటికి నొక్కతీరుగా జరుగుచున్నది. ఇందువలన వారు నానాటికిధనికులై సుఖపడుటయు, మనము దరిద్రులమై బాధపడుటయు సంప్రాప్తించినది.
ఈధనప్రవాహము మొదట నింగ్లీషు కంపెనీవారును వారి యుద్యోగులును మన దేశనవాబులవల్ల రాజులవల్ల బహు